టికెట్ల మదింపు పై చర్చలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రకటన మొదలు పెట్టింది .తెలంగాణ లో 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలి జాబితాన్ని విడుదల చేసింది .
ఇందులో కొంతమంది కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కొంతమంది ఎంపీలకు కూడా అసెంబ్లీ సీట్లు కేటాయించింది .ఈ జాబితాలో కొంతమంది కీలక నేతలతో పాటు మరి కొంతమంది కొత్త తరం నేతలకు కూడా అవకాశం దక్కింది.అయితే ఇటీవల పార్టీలో చేరిన కీలక నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Thummala Nageswara Rao ) ల పేరు మొదటి లిస్ట్ లో లేకపోవడం కొంత ఆసక్తి ని కలిగించింది .అంతే కాకుండా కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, నాగం జనార్దన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కి గౌడ్( Madhu Goud Yaskhi ), వాటి కీలక నేతల పేర్లు లేకపోవడం ఆయా నేతలకు అసంతృప్తి కలిగించినట్టు తెలుస్తుంది .
అయితే మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి చర్చలు జరిగిన తర్వాత తదుపరి లిస్టు రిలీజ్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేని ఆశా వహులు తక్కువగా ఉన్న సీట్ల లిస్టు ప్రకటించినట్లుగా తెలుస్తుంది.అయితే గుప్పెట తెరవడానికి సిద్ధమైన కాంగ్రెస్ ఇక అసంతృప్తులను ఏ మేరకు బుజ్జగిస్తుంది అన్న దాన్ని బట్టి కాంగ్రెస్( Congress party ) దుపరి ప్రయాణం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
మరోపక్క బారతీయ రాష్ట్ర సమితి కూడా 51 మంది అభ్యర్థులకు ఈరోజు బీఫారాలు అందజేసింది.మిగతా వారికి మరో రెండు రోజుల్లో అందజేస్తామని చెబుతున్నప్పటికీ చివరి నిమిషం వరకు అనేక మార్పులు ఉంటాయని ,ప్రకటించిన అభ్యర్థులను కూడా మారుస్తారంటూ మీడియా లో ఊహాగానాలు చెలరేగడంతో ఆయా అభ్యర్థులలో టెన్షన్ వాతావరణ నెలకొంది.ఇక రేపో మాపో బీజేపీ లిస్టు కూడా రిలీజ్ అయితే ఇక రాజకీయ హడావిడి పీక్ స్టేజ్ కి చేరుతుందని తెలుస్తుంది .ఒక కుటుంబానికి ఒకటి సీటు నియమం మీద కాంగ్రెస్ ఎంతగా నిలబడినప్పటికీ కొంతమందికి విషయం లో మాత్రం రాజకీయ సమీకరణాల మధ్య రాజీపడక తప్పలేదు అని తెలుస్తుంది.ఉత్తంకుమార్ రెడ్డి సతీమణికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ మైనంపల్లి కుమారుడు రోహిత్ రెడ్డి కూడా మెదక్ స్థానాన్ని కేటాయించడంతో తన సిద్ధాంతాల పట్ల రాజీ పడక తప్పని పరిస్తితి లో కాంగ్రెస్ పడినట్లుగా తెలుస్తుంది.
మరి ఇది కాంగ్రెస్ లో కొత్త సమస్యలకు ఆజ్యం పోస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి.