కోల్ ఇండియా, సింగరేణిలో పనిచేసి పదవి విరమణ పొందిన కార్మికులకు కోల్ మైన్స్ పెన్షన్ స్కీం ద్వారా పెన్షన్ లభిస్తుంది.బొగ్గు ఫించన్ దారులు కోల్ మైన్స్ పెన్షన్ పథకం-1998 సమీక్ష, పెన్షన్ సవరణ కోసం తొమ్మిది డిసెంబర్ 2019న జంతర్ మంతర్ వద్ద ఒక రోజు,25-28 జులై 2022 వరకు అదే స్థలం లో రిలే నిరాహార దీక్షచేసారు.
అక్టోబర్ 10 న దేశం లోని అన్ని కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసుల ముందు కూడ ధర్నా నిర్వహించారు.సంస్కరణలు ప్రారంభమైనప్పటికి, ఇది చాలా నెమ్మది గా ఉంది.
పెన్షన్ రివిజన్ యొక్క ఫలం తినకుండా బొగ్గు పెన్షన్ దారులు ప్రతి రోజు చనిపోతున్నారు.అందువలన వారి డిమాండ్ పై ముందస్తు చర్యల కోసం 5/12/2022న న్యూ ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద మరో సారి ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
దేశంలో వెలుగులు నింపేందుకు బొగ్గును ఉత్పత్తి చేసేందుకు కష్ట పడుతున్న బొగ్గు ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించేందుకు విప్లవాత్మక చర్యగా ఈ పథకాన్ని బిజెపి ప్రభుత్వం ప్రారంభించింది.ఈ పథకం బొగ్గు మంత్రిత్వ శాఖ క్రింద పని చేస్తున్న కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చే నిర్వహించబడుతుంది.
ఈ పెన్షన్ పథకం 31/3/1994 తరువాత పదవి విరమణ చేసిన సుమారు ఆరు లక్షల మంది బొగ్గు ఉద్యోగులకు వర్తిస్తుంది.ఇందులో సింగరేణి లో పనిచేసి పదవి విరమణ పొందిన దాదాపు 80,000 మంది ఫించనుదారులు/వితంతువులు ఉన్నారు.
నేటి కాలం లో చాలా మంది బొగ్గు ఫించనుదారులు,వారి వితంతువులు నెలవారి పెన్షన్ గా 500 నుండి 1000 రూపాయల లోపు పొందుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఇస్తున్న ఆసరా పెన్షన్ 2016 రూపాయల కన్నా తక్కువగా ఉంది.కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పెన్షన్ నిర్ణయించడం లో ఏకపక్షంగా వ్యవరిస్తుంది.దీనికి ఆర్థిక మంత్రిత్వశాఖతో పాటు ప్రధాన మంత్రి కార్యాలయం మరియు ఇతర మంత్రిత్వశాఖ ల జోక్యం అవసరం కావచ్చు.
గతంలో కోల్ మైన్స్ పెన్షన్ ఫండ్ దుర్వినియోగం కారణంగా క్షిణించిన ఫండ్ బలోపేతం కొరకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే కోల్ మైన్స్ పెన్షన్ పథకం-1998 పునర్నిర్మాణం కొరకు, మరియు బొగ్గు ఫించనుదారుల పెన్షన్ పెరిగే అవకాశం ఉంది.