బుట్ట బొమ్మ పూజా హెగ్దేకి కాలికి గాయమైందన్న విషయం తెలిసిందే.సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ లో ఆమె కాలు బెనికినట్టు అయ్యింది.
దానితో ఆమె దాదాపు 3 వారాల పాటు రెస్ట్ తీసుకుంది.వైద్యుల సహాయంతో ఇంటి దగ్గరే ట్రీట్ మెంట్ తీసుకుంది పూజా హెగ్దే.
అయితే ప్రస్తుతం కాలి నొప్పి తగ్గినట్టు తెలుస్తుంది.అయితే 3 వారాల క్రితం ట్రీట్ మెంట్ టైం లో తను నడక నేర్చుకుంటున్న వీడియోని షేర్ చేసింది పూజా హెగ్దే.
జీవితంలో రెండోసారి నడక నేర్చుకుంటున్నా అంటూ కామెంట్ పెట్టింది అమ్మడు.ఈ వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్ అయ్యో పూజా ఎంత కష్టం వచ్చింది అని అంటున్నారు.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా హెగ్దే తన గ్లామర్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.అయితే అమ్మడు చాలా గ్యాప్ తర్వాత ఇంట్లో ఇన్ని రోజులు గడిపినట్టు తెలుస్తుంది.
అదికూడా కాలికి గాయమైంది కాబట్టే అలా ఉండాల్సి వచ్చిందట.బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, వెంకటేష్ నటిస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకున్న పూజా హెగ్దే మరోపక్క మహేష్ త్రివిక్రం కాంబో మూవీలో కూడా ఛాన్స్ అందుకుంది.
పూజా బేబీ లైన్లో ఇంకా చాలా సినిమాలు ఉన్నట్టు తెలుస్తుంది.