కడప జిల్లాలో దాయాదుల మధ్య ఘర్షణలో ఒకరు మృత్యువాత పడ్డారు.బద్వేలు పట్టణం కాపు వీధిలో రెండు వర్గాల మధ్య స్థలం విషయంలో వివాదం చెలరేగింది.
గొడవ కాస్త ముదరడంతో ఇరు వర్గాలు కర్రలతో పరస్పర దాడులకు పాల్పడ్డారు.ఈ ఘర్షణలో వద్దిరెడ్డి సుబ్బారెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం.
పలువురు తీవ్రంగా గాయపడ్డారు.బాధితులను మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.దర్యాప్తు చేపట్టారు.