2023 సంవత్సరంలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ల జాబితాలో వాల్తేరు వీరయ్య మూవీ ముందువరసలో ఉంటుంది. చిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చింది.
కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండటం కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి.ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం.
ఈ నెల 23వ తేదీన దసరా పండుగ కానుకగా జెమినీ టీవీలో వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ) వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారమైంది.సాధారణంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్లుగా ప్రసారమైన స్టార్ హీరోల సినిమాలకు మంచి రేటింగ్స్ వస్తాయి.
అయితే వాల్తేరు వీరయ్య మాత్రం రేటింగ్స్ విషయంలో తీవ్రస్థాయిలో నిరాశపరిచిందనే చెప్పాలి.ఈ సినిమా అర్బన్ రేటింగ్ 5.14 కాగా అర్బన్ + రూరల్ రేటింగ్ 4.56 కావడం గమనార్హం.
అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం జెమిని ఛానల్ లో ప్రసారం కావడం, జనవరిలో విడుదలైన సినిమాను దాదాపుగా తొమ్మిది నెలల తర్వాత బుల్లితెరపై ప్రసారం చేయడంతో రేటింగ్స్ తగ్గాయని చెబుతున్నారు.చిరంజీవి( Chiranjeevi ) సినిమాలలో చాలా సినిమాలు గతంలో బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్నాయని చిరంజీవి ఫ్లాప్ సినిమాలు సైతం మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్న సందర్భాలు బోలెడు అని ఫ్యాన్స్ చెబుతున్నారు.
వాల్తేరు వీరయ్య సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా కోనవెంకట్ కూడా ఈ సినిమా కోసం పని చేశారు.చిరంజీవి కెరీర్ విషయానికి వస్తే వశిష్ట మూవీ మినహా మరే సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.చిరంజీవి తర్వాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి మంచి లాభాలను అందుకుంటాయేమో చూడాలి.