నగరంలోని మురళీ ఫార్చున్ హోటల్ లో జరిగిన ఈ సమావేశంలో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పరిమిత సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు.జనసేన పార్టీకి మద్దతుగా నిలిచే అంశంపై ప్రధానంగా చర్చించారప.
ఏపీలో ముగ్గురు హీరోల అభిమానులు కలిసి సంయుక్తంగా పనిచేసి, జనసేన పార్టీని బలోపేతం చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలపై చర్చించి, ప్రణాళిక వేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.స్వామినాయుడు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు
మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ తో నడుస్తారు ప్రతి గ్రామంలో అందరూ కలిసి పని చేయాలని నిర్ణయించాం జనసేన ను జనంలోకి తీసుకెళ్లేలా మా వంతు కృషి చేస్తాం 2024లో పవన్ కళ్యాణ్ ను సిఎం ని చేయడమే మా లక్ష్యం అధికారంలోకి వచ్చేలా ప్రణాళిక బద్దంగా పని చేస్తాం మరికొన్ని సమావేశాలు అనంతరం కార్యాచరణ సిద్దం చేస్తాం అభిమానులకు, నాయకులకు మధ్య అంతరాలు లేవు పార్టీ ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళతాం మెగా అభిమానులు అందరూ జనసేన కార్యకర్తలు గా పని చేస్తారు పొత్తుల అంశం మా పరిధి కాదు… పెద్దలు నిర్ణయిస్తారు గతంలో ప్రజారాజ్యం పై అనేక కుట్రలు చేశారు కుటుంబాలు వదిలి ఆనాడు చిరంజీవి కోసం పని చేశాంఇప్పుడు జనసేన పై అసత్యాలు, పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సిఎం కావడం కోసం అందరూ సంకల్పంతో పని చేయాలి