ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన బేబీ సినిమా ( Baby Movie ) పేరు మారుమోగిపోతుంది.ఈ సినిమా విడుదలయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా సుమారు 70 కోట్ల కలెక్షన్ల వరకు సాధించి రికార్డు సృష్టించింది.
ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి ( Chiranjeevi ) మాట్లాడుతూ సినిమాలోని ప్రతి సన్నివేశం గురించి మాట్లాడుతూ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు.

తాను బేబీ సినిమా చూడగానే ఇది ఒక ఎడ్యుకేటెడ్ మూవీ ( Educated Movie ) అని తనకి అనిపించిందని తెలిపారు.ఈ సినిమా కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది సినిమాని మీరు వదిలేసిన మిమ్మల్ని సినిమా వదలదు.ఈ సినిమా చూసిన తర్వాత తాను దాదాపు రెండు మూడు రోజులపాటు ఈ సినిమా ధ్యాసలోనే ఉన్నానని చిరంజీవి తెలిపారు.
ఇక ప్రస్తుత కాలంలో యువత వ్యవహార శైలి గురించి కూడా ఈ సందర్భంగా ఈయన మాట్లాడారు.యువత ప్రస్తుతం సోషల్ మీడియాలోనే తమ జీవితం గడిపేస్తున్నారని తెలిపారు.

సెల్ ఫోన్ పట్టుకుని సోషల్ మీడియాలో మునిగిపోవడంతో అది మన చేతులలో ఉందని అనుకుంటున్నారు కానీ మనమే సోషల్ మీడియా జీవితంలో బ్రతుకుతున్నామని ఈయన తెలిపారు.ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తూ ఏదో ఒక సమయంలో అనరాని మాటలు అనడం దానిని పట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది.ప్రస్తుత కాలంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి అందుకే ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని అదేవిధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.