చిరంజీవి నిజంగానే చిరంజీవే.. ప్రతిరోజూ లక్షల్లో సాయం చేస్తున్నా చెప్పుకోని గొప్పోడంటూ?

సినిమా ఇండస్ట్రీలో అప్పటికీ ఇప్పటికీ భారీ పారితోషికం తీసుకుంటున్న అగ్ర హీరోలలో చిరంజీవి( Chiranjeevi ) ఒకరు.చిరంజీవి ప్రస్తుత పారితోషికం 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువేనని సమాచారం.

 Chiranjeevi Great Qualities Details Here Goes Viral In Social Media Details Here-TeluguStop.com

అయితే ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నా రూపాయి కూడా దానం చెయ్యడానికి పదిసార్లు ఆలోచించే హీరోలు చాలామంది ఉన్నారు.అయితే ఈ హీరోలలో చిరంజీవి మాత్రం భిన్నం అనే చెప్పాలి.

Telugu Bhola Shankar, Chiranjeevi, Meher Ramesh, Tollywood, Young Directors-Movi

సామాన్యుడు అయినా, సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు అయినా కష్టం వస్తే ఆదుకునే విషయంలో చిరంజీవి చిరంజీవే అని చెప్పవచ్చు.ప్రతిరోజూ చిరంజీవి చేసే సహాయం లక్షల్లో ఉంటుంది.ఆయన నుంచి సహాయం పొందుతున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు.తనకు చేతనైనంత సహాయం చేసే విషయంలో మెగాస్టార్ ముందువరసలో ఉంటారు.చిరంజీవి మంచి మనస్సే ఆయనను ఈ స్థాయికి తెచ్చిందని చాలామంది భావిస్తారు.చిరంజీవి వయస్సు 68 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో కూడా ఆయన ఎంతగానో కష్టపడుతున్నారు.

భోళా శంకర్( Bhola Shankar ) సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ఈ సినిమా చిరంజీవికి మరో విజయాన్ని అందిస్తుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి మెహర్ రమేష్( Meher Ramesh ) సినిమాను వేగంగా పూర్తి చేసి ఏకంగా నాలుగు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Meher Ramesh, Tollywood, Young Directors-Movi

వరుసగా నాలుగు సినిమాలలో చిరంజీవి నటించనుండగా యంగ్ జనరేషన్ డైరెక్టర్లు ఈ సినిమాల కోసం పని చేయనున్నారని తెలుస్తోంది.ఈ సినిమాలు అన్నీ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.చిరంజీవి మల్టీస్టారర్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండగా ఈ సినిమాలకు బిజినెస్ భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.చిరంజీవికి రాబోయే రోజుల్లో సైతం కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube