మెగా ఫ్యాన్స్ కూడా ఆ విషయంలో ఆందోళన.. ఇలా చేస్తే కష్టమే!

Chiranjeevi Fans Also On Disappointment With Remake Movies , Remake Movie, Megastar Chiranjeevi, Pawan Kalyan, Mega Fans,Pawan, Megastar

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన దగ్గర నుండి రీమేక్ సినిమాలపైనే ఎక్కువ ద్రుష్టి పెడుతున్నాడు.పక్క భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇక్కడ రీమేక్ చేసి హిట్స్ కొట్టాలని అలా సేఫ్ జోన్ లోనే ఉండేందుకు ఆలోచిస్తున్నాడు.

 Chiranjeevi Fans Also On Disappointment With Remake Movies , Remake Movie, Megas-TeluguStop.com

కానీ ఈ సినిమాల వల్ల మెగా ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు అని చిరు ఆలోచించలేక పోతున్నారు.

పక్క భాషల్లో రిలీజ్ అయిన సినిమాలు అప్పటికే డబ్బింగ్ రూపంలో మన ప్రేక్షకులు చూస్తున్నారు.

అందుకే ఇలాంటి రీమేక్ సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి కనబర్చడం లేదు.అందులోను ఓటిటి రావడం వల్ల భాషతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులు అన్ని సినిమాలు చూస్తున్నారు.

మరి అలా కంటెంట్ తెలిసిన సినిమాలను మళ్ళీ రీమేక్ రూపంలో తీసుకు వచ్చిన పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టరు.

ఒక వేళ రీమేక్ చేసింది స్టార్ హీరో అయితే ఓపెనింగ్స్ మాత్రమే బాగా వస్తాయి కానీ ఆ తర్వాత నిరాశ మాత్రం అలానే ఉంటుంది.

అందుకే ఫ్యాన్స్ లో నిరాశ తప్ప మరొకటి కనిపించడం లేదు.ఒకప్పుడు రీమేక్ సినిమాలు అంటే ఆసక్తి బాగానే ఉండేది కానీ ఇప్పుడు వాటికీ అంతగా విలువ ఇవ్వడం లేదు.

ఇలా ఉన్న పరిస్థితుల్లో కూడా పవన్, మెగాస్టార్ వంటి స్టార్ హీరోలే రీమేక్ సినిమాలు ప్రకటించడం ఫ్యాన్స్ కు మింగుడు పడడం లేదు.

Telugu Fans, Chiranjeevi, Pawan, Pawan Kalyan-Movie

అందుకే పవన్ తేరి రీమేక్ చేస్తున్నాడు అని వార్త రాగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేసారు.మాకు రీమేక్ వద్దు అంటూ పెద్ద యుద్ధమే చేసారు.ఇక ఇప్పుడు రీమేక్ విషయంలో మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం చిరు నుండి కొత్త కథలను కోరుకుంటున్నారు.అందుకే మరో రీమేక్ సినిమా అంటే పెదవి విరుస్తున్నారు.

రీమేక్ సినిమాలు వద్దని సోషల్ మీడియాలో మాట్లాడు కుంటున్నారు.మరి మెగాస్టార్ ఈ విషయంలో ఆలోచిస్తారో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube