వన్స్ మోర్ జగనన్న అంటున్నారు రాష్ట్ర ప్రజలు చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి( Chevireddy Mohith Reddy ) ఆనందం వ్యక్తం చేశారు తిరుపతి రూరల్ మండలం తిరుమల నగర్ పంచాయితీ పరిధిలో మన ఊరికి మన మోహిత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో యువకులు భారీగా పాల్గొన్నారు.
తిరుమల నగర్ పంచాయితి( Tirumala Nagar )కి ఐదేళ్ల లో 7కోట్ల తో అభివృద్ధి చేశాం అని స్పష్టం చేశారు.అర్హులైన పేదలకు వారి ఖాతాల్లో రెండు నుంచి నాలుగు లక్షలు రూపాయలు సంక్షేమ పథకాలు( Welfare schemes ) ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అందించామని తెలిపారు.
నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోగతంలో కన్నా చంద్రగిరి నియోజకవర్గంలో భారీ ఆధిక్యం తో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈనెల 24వ నామినేషన్ వేయనున్నట్లు తెలిపిన మోహిత్ రెడ్డి, ప్రతి సర్వేలు వైసీపీ కి అనుకూలంగా చెబుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు
.