వావ్, ఈ కొరియన్ యువతి డాన్స్ స్టెప్పులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

విదేశీయులు మన ఇండియాకు సంబంధించిన పాటలకు డ్యాన్సులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు.ఇటీవల ఒక దక్షిణ కొరియా మహిళ పంజాబీ డాన్స్‌తో అందరి మనసు దోచేసింది! సంస్కృతులను అద్భుతంగా మిళితం చేసిన ఈ యువతి అదిరిపోయే నృత్య ప్రదర్శనతో అందరి హృదయాలను దోచుకుంది.“బజ్రే ద సిట్టా” ఆల్బమ్‌లోని ప్రసిద్ధ పంజాబీ పాట “సుర్మెదానీ“కి ఆమె డ్యాన్స్ చేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ పాటను నూర్ చాహల్, జ్యోతికా టాంగ్రీ పాడారు.

 This Young Korean Girl's Dance Steps Will Make You Cringe, South Korea, Viral V-TeluguStop.com

పింక్, ఆకుపచ్చ రంగుల భారతీయ దుస్తులను ధరించిన ఈ డ్యాన్సర్ సాంగ్ బీట్స్‌కు సరిపోయేలా కచ్చితమైన స్టెప్స్‌ డ్యాన్స్ చేస్తుంది.ఆమె ఈ పర్ఫామెన్స్‌తో చూపరులను ఆకట్టుకుంటుంది.ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ వావ్ అనిపించాయి.ఇన్‌స్టాగ్రామ్ యూజర్ (@vlog_by_aman.khela) పోస్ట్ చేసిన ఈ వీడియో ఏప్రిల్ 17న విడుదలైనప్పటి నుంచి వేలాది లైక్‌లు, లక్షలాది వ్యూస్‌తో సూపర్‌ వైరల్ అయింది.

చాలా మంది నెటిజన్లు ఆమె డ్యాన్స్ స్కిల్స్‌కు ముగ్ధులై, ప్రేమ ఇస్తున్నారు.ఫైర్ ఇమోజీలతో కామెంట్ సెక్షన్లో నింపేస్తున్నారు.గాయని జ్యోతికా టాంగ్రీ కూడా ఈ వీడియో పై కామెంట్ చేశారు, ఆమె “నా రోజును అందంగా మార్చింది.” అని తన ప్రశంసలు కురిపించారు.ఈ వీడియో భారతీయ సంస్కృతి ఇతర దేశాలను కూడా ఆకర్షిస్తుందనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది.

ఎందుకంటే పంజాబీ సంగీతం( Punjabi music ) దక్షిణ కొరియాలో కూడా ప్రజాదరణ పొందుతోంది.దక్షిణ కొరియా డ్యాన్సర్( South Korea Dancer ) నాట్య ప్రదర్శన విభిన్న సంప్రదాయాల మధ్య అందంగా వారధిని నిర్మిస్తుంది, సంగీతం, నృత్యానికి నిజంగా ఎటువంటి సరిహద్దులు లేవని నిరూపిస్తుంది.

ఈ బ్యూటిఫుల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube