Chandrababu : టీడీపీ..జనసేన గెలుపు ఖాయం అంటున్న చంద్రబాబు..!!

2024 ఎన్నికలలో ఏపీలో జనసేన( janasena ) తెలుగుదేశం కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ కూటమిలో బీజేపీ కూడా జత కలిసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 Chandrababu Says Victory Of Tdp Janasena Is Certain-TeluguStop.com

ఈ విషయం నడుస్తూ ఉండగానే తెలుగుదేశం జనసేన కూటమి తొలి జాబితా విడుదల చేయడం జరిగింది.ఈ జాబితాలో 94 అసెంబ్లీ స్థానాలలో టీడీపీ,  24 అసెంబ్లీ మూడు ఎంపీ స్థానాలలో జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రకటన చేశారు.

ఈ ప్రకటన అనంతరం తాడేపల్లిగూడెంలో “జెండా”( jenda ) పేరిట పవన్… చంద్రబాబు సంయుక్తంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు.పరిస్థితి ఇలా ఉంటే నేడు దాచేపల్లిలో “రా కదలిరా” సభలో చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు( Chandrababu ) మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో జనసేన తెలుగుదేశం కూటమి గెలుపు ఖాయమని వ్యాఖ్యానించారు.ఎన్నికల యుద్ధానికి మహిళలు, యువకులు సిద్ధమంటున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఐదేళ్ళుగా దుర్మార్గమైన పరిపాలన సాగుతోంది.సీటు కావాలంటే నన్ను.పవన్ నీ తిట్టాలని షరతులు పెడుతున్నారు.పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు.

వారిని వదిలిపెట్టేదే లేదు అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.వచ్చే ఎన్నికలలో రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఓడిపోయేందుకు జగన్ సిద్ధం.సిద్ధం అంటున్నారు.

ఈ ఐదేళ్లలో జగన్ ఎన్నో తప్పులు చేశారు.ఆ తప్పులకు ఆయనను జైలులో ఎన్ని సంవత్సరాలు ఉంచాలి.? జగన్ బెదిరింపులకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరు.పులివెందుల పంచాయతీ చేస్తే కుర్చీ మడిచి మీ ఊరికి పంపిస్తాం.

జరగబోయే ఎన్నికలలో కుల.మతాలు కతీతంగా ప్రజలు ఓట్లు వేయాలని చంద్రబాబు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube