Chandrababu : టీడీపీ..జనసేన గెలుపు ఖాయం అంటున్న చంద్రబాబు..!!
TeluguStop.com
2024 ఎన్నికలలో ఏపీలో జనసేన( Janasena ) తెలుగుదేశం కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కూటమిలో బీజేపీ కూడా జత కలిసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ విషయం నడుస్తూ ఉండగానే తెలుగుదేశం జనసేన కూటమి తొలి జాబితా విడుదల చేయడం జరిగింది.
ఈ జాబితాలో 94 అసెంబ్లీ స్థానాలలో టీడీపీ, 24 అసెంబ్లీ మూడు ఎంపీ స్థానాలలో జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రకటన చేశారు.
ఈ ప్రకటన అనంతరం తాడేపల్లిగూడెంలో "జెండా"( Jenda ) పేరిట పవన్.చంద్రబాబు సంయుక్తంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు.
పరిస్థితి ఇలా ఉంటే నేడు దాచేపల్లిలో "రా కదలిరా" సభలో చంద్రబాబు పాల్గొన్నారు.
"""/" /
ఈ సందర్భంగా చంద్రబాబు( Chandrababu ) మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో జనసేన తెలుగుదేశం కూటమి గెలుపు ఖాయమని వ్యాఖ్యానించారు.
ఎన్నికల యుద్ధానికి మహిళలు, యువకులు సిద్ధమంటున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఐదేళ్ళుగా దుర్మార్గమైన పరిపాలన సాగుతోంది.
సీటు కావాలంటే నన్ను.పవన్ నీ తిట్టాలని షరతులు పెడుతున్నారు.
పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు.వారిని వదిలిపెట్టేదే లేదు అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
వచ్చే ఎన్నికలలో రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఓడిపోయేందుకు జగన్ సిద్ధం.
సిద్ధం అంటున్నారు.ఈ ఐదేళ్లలో జగన్ ఎన్నో తప్పులు చేశారు.
ఆ తప్పులకు ఆయనను జైలులో ఎన్ని సంవత్సరాలు ఉంచాలి.? జగన్ బెదిరింపులకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరు.
పులివెందుల పంచాయతీ చేస్తే కుర్చీ మడిచి మీ ఊరికి పంపిస్తాం.జరగబోయే ఎన్నికలలో కుల.
మతాలు కతీతంగా ప్రజలు ఓట్లు వేయాలని చంద్రబాబు సూచించారు.
వార్ 2 ఎన్టీయార్ విజయాలను కంటిన్యూ చేస్తుందా..?