ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు.విధ్వంసానికి నాంది పలికిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు.
రివర్స్ టెండరింగ్ అన్నారు కానీ పరిపాలన రివర్స్ కు వెళ్లిందని చంద్రబాబు విమర్శించారు.అమరావతిని విధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందన్నారు.
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారని మండిపడ్డారు.పోలవరాన్ని గోదావరిలో కలిపేశారన్న చంద్రబాబు రాష్ట్రంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని చెప్పారు.
ఏపీలో దిశాచట్టం ఎక్కడుందని ప్రశ్నించారు.అప్పుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని, ఏపీలో రూ.2.47 లక్షల కోట్ల అవినీతి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు.