కరోనా కారణంగా ప్రపంచం మొత్తం విలవిలలాడిపోతుంది.చైనాలో మొదలైన ఈ భయంకరమైన వైరస్ ఇటలీ, అమెరికా, ఇరాక్, స్పెయిన్, ఇండియాలతో పాటు 200 దేశాలకు వ్యాప్తి చెందింది.
ఈ సమయంలో వందలాది దేశాల్లో లాక్ డౌన్‌ను ప్రకటించడం జరిగింది.లాక్ డౌన్ ప్రకటించని అమెరికాలో మాత్రం పాజిటివ్‌ల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగి పోతుంది.
లక్షల సంఖ్యలో అక్కడ పాజిటివ్‌లు నమోదు అవుతున్నాయి.అయినా కూడా అమెరికా లాక్ డౌన్‌ను ప్రకటించడం లేదు.
ఇక జపాన్‌లో కూడా అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించలేదు.అయినా కూడా అక్కడ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది.కరోనాను జయించిన దేశంగా జపాన్ నిలిచింది.చైనా నుండి మొదటగా వైరస్ వ్యాప్తి చెందిన దేశాల్లో జపాన్ కూడా ఒకటి.
కాని అక్కడ వైరస్ వ్యాప్తి మాత్రం అతి తక్కువగానే ఉంది.అక్కడ లాక్‌డౌన్ పరిస్థితులు లేకుండానే ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించడం వల్ల వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని అంటున్నారు.
జపాన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు.జపనీస్‌ను కరోనా ఏం చేయలేక పోవడంపై జపాన్‌లో ఉండే ఒక ఇండియన్ తన అనుభవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.అతడు జపాన్‌లో అవలంభించే పారిశుద్ద పద్దతులను వివరించాడు.

ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుంది కనుక దేశ వ్యాప్తంగా అంతా కూడా మాస్క్‌లు ధరించడంతో పాటు శానిటైజర్స్ వాడుతున్నారు.కాని జపాన్‌లో మాత్రం కరోనా కంటే ముందే అంటే వారి రెగ్యులర్ జీవితంలో మాస్క్‌లు ఇంకా శానిటైజర్స్ వాడకం చాలా కామన్ అంటా.
జపాన్‌లో ఈ పరిస్థితులు రాకముందు కూడా 60 శాతం మంది మాస్క్‌లతోనే బయటకు వెళ్లే వారు.
బయటకు వెళ్లినా ఇంట్లోకి వచ్చినా కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడంతో పాటు చాలా పరిశుభ్రతను పాటిస్తూ ఉంటారు.
ప్రస్తుతం అన్ని దేశాల్లో కూడా పరిసరాలను ఎలా అయితే శానిటైజ్ చేస్తున్నారో అలా అక్కడ కరోనాకు ముందు కూడా శానిటైజ్ చేస్తూ ఉండేవారట.
జపనీస్ సాదారణంగా కూడా సామాజిక దూరంను పాటిస్తూ ఉంటారు.

ప్రస్తుతం జపాన్‌లో ప్రజా రవాణ సాదారణంగానే ఉంది, హోటల్స్ రెస్టారెంట్స్ ఓపెన్ చేసి ఉన్నాయి.ఇక తమ ఆఫీస్ కార్యక్రమాలు కూడా రెగ్యులర్‌గానే జరుగుతున్నాయని అంటున్నారు.
పరిశుభ్రత అనేది జపనీస్‌ల జీవన శైలిలోనే ఉంటుంది కనుక కరోనా వైరస్ జపాన్‌లోకి ఎంటర్ అయినా కూడా అది అంత స్పీడ్‌గా వ్యాప్తి చెందడం లేదని అంటున్నారు.
పిల్లలకు అక్కడ అక్షరాలు నేర్పించక ముందే పరిశుభ్రత గురించి నేర్పించడం వల్ల ఈ రోజున కరోనాను జపాన్ జయిస్తుందని ఆయన అన్నాడు.