నాని సినిమా ‘హిట్‌’ సెన్సార్‌ టాక్‌

ఫలక్‌నుమా దాస్‌ చిత్రంతో హీరోగా పరిచయం అయిన విశ్వక్‌సేన్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో నాని నిర్మించిన ‘హిట్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.భారీ అంచనాలున్న ఈ చిత్రంకు సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

 Censor Board Give The Ua Certificate To Hitt Movie-TeluguStop.com

ఇది ఒక కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌ కథ.దీన్ని చాలా ఆసక్తికరంగా దర్శకుడు శైలేష్‌ తెరకెక్కించాడు అంటూ నాని చాలా నమ్మకంగా చెబుతున్నాడు.సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుంది.

Telugu Censorboard, Falaknuma Das, Hitt, Nani Hitt, Viswak Sen-Movie

సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు.ఈ సినిమాలో విశ్వక్‌సేన్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించాడు.ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేలా సినిమాకు సంబంధించిన ఒక సీన్‌ను పూర్తిగా రివీల్‌ చేశారు.

సినిమాలోని కీలక సన్నివేశాన్ని రివీల్‌ చేయడంతో సినిమాపై సస్పెన్స్‌ పెంచారు.కథ ఏంటీ అసలు హత్య జరిగింది ఎందుకు ఎలా అనే విషయాలు తొసుకోవాలనే ఆసక్తి అందరిలో కలుగుతుంది.

Telugu Censorboard, Falaknuma Das, Hitt, Nani Hitt, Viswak Sen-Movie

మొదటి సినిమాతో నటుడిగా మంచి పేరు దక్కించుకున్న విశ్వక్‌సేన్‌ ఈ సినిమాలో చాలా సీరియస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించాడు.విభిన్నమైన సినిమాలతో నాని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.మరోసారి ఈ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకుంటాడో చూడాలి.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube