ప్రముఖ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, రానాలపై కేసు నమోదు..!

సినీ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, రానాల( Daggubati Venkatesh,Rana )పై కేసు నమోదు అయింది.హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేతపై బాధితుడు నందకుమార్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 Case Registered Against Popular Heroes Daggubati Venkatesh And Rana..!,rana Dagg-TeluguStop.com

ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి న్యాయస్థానం( Nampally Court ) దగ్గుబాటి వెంకటేశ్, రానాతో పాట దగ్గుబాటి సురేశ్ బాబు, అభిరామ్ లపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు ఐపీసీ 448, 452, 380, 506, 120 బీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ దగ్గుబాటి కుటుంబం డెక్కన్ కిచెన్( Demolition Of Deccan Kitchen ) కూల్చివేతకు పాల్పడిందని బాధితుడు నందకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.లీజు విషయంలో తనకు న్యాయస్థానం ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని తెలిపారు.ఈ కారణంగా తనకు సుమారు రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube