ఓటర్ ఐడీ కార్డ్( Voter ID Card ) లో పాత అడ్రస్ ఉందా.ఓటర్ ఐడీ కార్డులో అడ్రస్ మార్చాలనుకుంటున్నారా.
అయితే ఈ సింపుల్ స్టెప్స్ తో ఓటర్ ఐడీ కార్డులో చిరునామాను మార్చుకోండి.ఆన్ లైన్ లో నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి, అందులో చిరునామాను అప్డేట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్( National Voter Service Portal ) వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తే అక్కడ ఫారం-8 కనిపిస్తుంది.అయితే ముందుగా https://voters.eci.gov.in/ లోకి లాగిన్ అవ్వాలి.అక్కడ హోమ్ స్క్రీన్ మెనూలో ఫారం-8 కనిపిస్తుంది.క్లిక్ చేయాలి.
ఆ ఫారం పై షిఫ్టింగ్ ఆర్ రెసిడెన్స్/ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిక్టింగ్ ఎలక్ట్రోరల్ రోల్/ రీప్లేస్మెంట్ ఆఫ్ ఈపీఐపీ/మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యుడీ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత ఒక దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది అక్కడ సెల్ఫ్ లేదా అదర్ ఎలక్టర్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది.అందులో అవసరం అయిన దానిని ఎంచుకోవాలి.అంటే మీకోసం అయితే సెల్ఫ్ అని ఇతరుల కోసం అయితే అదర్ ఎలక్టర్ అనేదానిపై సెలెక్ట్ చేయాలి.
ఆ తర్వాత ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది.ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక డైలాగ్ బాక్స్ లో మీ పేరు, ఇతర వివరాలు కనిపిస్తాయి.
ఆ వివరాలన్నీ మీవే అయితే నిర్ధారణ చేయడానికి ఓకే బటన్ పై క్లిక్ చేయాలి.ఇక స్క్రీన్ పై కనిపిస్తున్న షిప్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
అక్కడ మీరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నారా లేదంటే బయట నివసిస్తున్నారా అనే విషయం అడుగుతుంది.మీ నివాస స్థానాన్ని బట్టి దానిని ఎంచుకోవాలి.ఫారం-8 లోని సెక్షన్-ఏ లో రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ/పార్లమెంట్ నియోజకవర్గం ఎంచుకోవాలి.సెక్షన్-బీ లో వ్యక్తిగత వివరాలు నింపాలి.
సెక్షన్-సీలో మీరు మార్చుకోవాలి అనుకుంటున్నా మాను గురించి దరఖాస్తులు సబ్మిట్ చేయాలి.అయితే మీరు మార్చుకున్న చిరునామాకు తగ్గట్టుగా ఒక రుజువు పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.







