దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై గులాబీ బాస్, సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.చేతగాని ప్రతిపక్ష దద్దమ్మలు తమపై భౌతికదాడులు చేస్తున్నారని తెలిపారు.
ఈ మేరకు కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.దీనికి తెలంగాణ సమాజమే సమాధానం చెప్పాలన్నారు.
అలాగే ఇది ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి కాదని, కేసీఆర్ పై జరిగిన దాడని తెలిపారు.ఈ క్రమంలోనే తాము కూడా ఇదే తరహాలో దాడి చేస్తే దుమ్ము కూడా మిగలదని చెప్పారు.
తాము దాడులు చేయలేమా? లేక చేతకాదా అని ప్రశ్నించారు.తమ సహనాన్ని పరీక్షిస్తే ఊరుకునేది లేదని తెలిపారు.