బాంబు బెదిరింపు.. కెనడా పార్లమెంట్‌‌కు కొద్దిగంటల పాటు లాక్, రంగంలోకి పోలీసులు,

సరిహద్దు ఏజెంట్ల నుంచి బాంబు బెదిరింపులు రావడంతో కెనడా పార్లమెంట్‌ను శనివారం కొన్ని గంటల పాటు లాక్‌ చేయాల్సి వచ్చింది.జాతీయ భద్రతకు ప్రమాదం కలిగే అవకాశం వున్నందున పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి.
కాగా… పార్లమెంట్‌కు సమీపంలోకి పేలుడు పదార్ధాలతో నిండిన వాహనం రావొచ్చని బోర్డర్ ఏజెన్సీకి చెందిన ఇంటెలిజెన్స్ శాఖ శనివారం ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరించింది.దీనిపై ఒట్టావా పోలీసులు శనివారం మాట్లాడుతూ.

 Canada Ottawa Police Launches Probe Post Bomb Threat Near Parliament,canada Otta-TeluguStop.com

తాము అనుమానాస్పదంగా సంచరిస్తోన్న రెండు వాహనాలను, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పారు.వారి వివరాల గురించి తెలియజేయకుండా.

ప్రజల భద్రతకు ఎటువంటి ముప్పు లేదని పోలీసులు తెలిపారు.అయితే వారిద్దరిపై ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని తెలుస్తోంది.

మరోవైపు.జాతీయ భద్రతను పర్యవేక్షించే రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (ఆర్‌సీఎంపీ)లోని స్పెషల్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ మాత్రం దర్యాప్తును ప్రారంభించింది.అయితే దీనిపై ఆర్‌సీఎంపీ మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.గోప్యత, ఇతర కారణాలను దృష్టిలో వుంచుకుని అభియోగాలు మోపేంత వరకు నేర పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్‌సీఎంపీ ధృవీకరించదు, తిరస్కరించదు, విడుదల చేయదని ఓ ప్రతినిధి తెలిపారు.

Telugu Bomb Threat, Canada, Canada Ottawa-Telugu NRI

ఇకపోతే.వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఈ ఏడాది ప్రారంభంలో వందలాది ట్రక్కులు కెనడా రాజధాని ఒట్టావాని ముట్టడించిన సంగతి తెలిసిందే.దీంతో పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.నాటి ఉద్రిక్తత కారణంగా పార్లమెంట్ మీదుగా వెళ్లే రోడ్డుని భద్రతా కారణాల రీత్యా అధికారులు నేటి వరకు మూసేవుంచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube