అద్దె ఇంట్లో వ్యభిచారం చేస్తూ, ఆ ఇంటినే కబ్జా చేసే ప్రయత్నం.. ఎక్కడంటే..?

ఓ వృద్ధ మహిళ అద్దె వస్తుంది కదా అని అశపడి ఇంటిని అద్దెకు ఇచ్చి నానా అవస్థలు పడుతోంది.అద్దెకు తీసుకున్న వాళ్ళ నిజస్వరూపం బయటపడడంతో ఏం చేయాలో తెలియక ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా న్యాయం జరగడం లేదంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

 By Committing Adultery In A Rented House And Trying To Take Possession Of That-TeluguStop.com

అద్దెకు తీసుకున్న వారు అద్దె చెల్లించకుండా దౌర్జన్యంగా ఆ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ ఘటన నరసారావుపేట( Narasaraopeta ) పట్టణంలో చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Saraopeta, Rami Peta-Latest News - Telugu

వివరాల్లోకెళితే.

నరసరావుపేట పట్టణంలోని రామిరెడ్డి పేట 21వ వార్డులో తిరుమల శెట్టి సుబ్బాయమ్మకు ఓ పెంకుటిల్లు ఉంది.ఆ ఇంటిని ఓ మహిళకు అద్దెకి ఇచ్చి తన పెద్ద కుమారుని దగ్గర ఉంటోంది.

అద్దెకు ఇల్లు తీసుకున్న మహిళ చాలా కాలంగా ఆ ఇంట్లోనే నివసిస్తూ ఓ గుట్కా వ్యాపారితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ, ఇంట్లోకి ఇతర మహిళలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది.అంతేకాకుండా ఇంట్లో మట్కా నిర్వహిస్తూ జల్సాలకు అలవాటు పడింది.ఈ కార్యకలాపాలతో ఆ మహిళకు రాజకీయంగా పలుకుబడి పెరిగింది.

Telugu Saraopeta, Rami Peta-Latest News - Telugu

ఈ క్రమంలో ఆ ఇంటికి అద్దె చెల్లించకుండా, ఆ ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఆ వృద్ధురాలి పై బెదిరింపులకు పాల్పడింది.దీంతో ఏం చేయాలో తెలియక ఆ వృద్ధురాలు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి( SP Ravi Shankar Reddy )కి ఫిర్యాదు చేసింది.సదరు ఎస్పీ ఆమెను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు పంపించారు.

పోలీసులు ఇది సివిల్ వ్యవహారమని తాము జోక్యం చేసుకోలేమని చెప్తూ కోర్టుకు వెళ్లాలని వృద్ధురాలిని సూచించారు.చివరికి ఆ వృద్ధురాలు ఆర్డీవో ఆఫీసుకు వెళ్లి తన గోడు వినిపించిన అధికారులు మాత్రం చేతులెత్తేయడంతో ఏం చేయాలో తెలియక లబోదిబోమంటుంది.

ఎవరైనా అధికారులు తన ఇంటిని విడిపించి ఇవ్వాలని కోరుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube