కేంద్రం చర్యలు భేష్... మన మిలిటరీలోకి ధీటైన అస్త్రాలు వచ్చేశాయ్!

కేంద్రం భారత్ ను పలు అంశాల్లో అభివృద్ధి పధంలో దూసుకెళ్లేలా చేస్తోంది.రాబోయే ప్రమాదాలను దృష్టి పెట్టుకొని సరిహద్దు దేశాల‌ను అక్ర‌మించుకొని ప‌రిపాలించాల‌నుకుంటున్న చైనాకు ధీటుగా బుద్ధి చెప్పేందుకు భార‌త్ అస్త్ర‌శ‌స్త్రాల‌తో రోజురోజుకీ బలపడుతోంది.

 Brave Weapons Have Arrived In Our Military , Central Government, Military,  Vir-TeluguStop.com

పాంగాంగ్ స‌ర‌స్సుపై పట్టు సాధించేందుకు అధునాత‌న బోట్ ల‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది.భార‌త ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ బోట్ ల‌ను భార‌త సైన్యానికి అధికారికంగా అంద‌జేశారు.

ఈ బోట్ ఒకేసారి 35 మంది సైనికులను సరస్సులోని ఏ ప్రాంతానికైనా అతి తక్కువ సమయంలో చేర్చగలదు.

దీనివల్ల సరిహద్దుల్లో భారత సైనిక శక్తి పెరుగుతుందని ఆర్మీ అధికారులు అభిప్రాయ పడ్డారు.

ఈ బోట్‌లను భారత సైన్యానికి చెందిన కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్నారు.సరిహద్దుల్లో శత్రు దేశాల కదలికలను నిశితంగా పరిశీలించేందుకు.దేశీయంగా తయారు చేసిన డ్రోన్‌ వ్యవస్థ కూడా భారత అమ్ములపొదిలో చేరింది.ఈ నిఘా డ్రోన్‌ సరిహద్దుల్లో సూక్ష్మమైన కదలికలను కూడా పసిగట్టగలుగుతుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ఈ డ్రోన్‌ వ్యవస్థ సాయంతో సరిహద్దులో భారత్‌ బలం మరింత పెరగనుంది.

Telugu Advanced Bot, Brave, Central, Drone System, Indiandefense, Military, Late

వాటితో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ అయినటువంటి మనోజ్ పాండే, లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ సమక్షంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత సైనికులకు F-INSAS వ్యవస్థకు సంబంధించిన AK-203 అసాల్ట్ రైఫిల్స్​ను రాజనాథ్​ సింగ్​ అందజేశారు.దాంతో ఒక్క ఆర్మీ అధికారులు మాత్రమే కాకుండా సైన్యం కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.ఈ న్యూస్ బయటకి రావడంతో డ్రాగన్ కుయుక్తులు ఇక ఫలించవని నిపుణులు అంటున్నారు.

ఇక దశమంతటా హర్షం వ్యక్తం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube