ప్రస్తుతం పాన్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక దర్శకుడు రాజమౌళి( Director Rajamouli ) .అయితే ఒక సినిమా విషయం లో ఈయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మరే డైరెక్టర్ క్రియేట్ చేయడం లేదు.
ఇక రాజమౌళి సినిమాను చాలా స్పెషల్ గా ఉండటమే కాకుండా జనాలను ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు.ఇక డైరెక్టర్లతో పోల్చుకుంటే రాజమౌళి అన్ని క్రాఫ్ట్ ల పైన చాలా మంచి కమాండ్ అయితే ఉంది.
అందువల్ల తన సినిమాల్లో ఒకటి ది బెస్ట్ ఔట్ పుట్ రావడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
ఇక ఇలాంటి రాజమౌళి తో ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు నటించాలనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.కానీ ప్రస్తుతం రాజమౌళి వరుసగా తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.ఇది ఒక రకంగా మనకు మంచి విషయం అనే చెప్పాలి.
ఇక ఇది ఇలా ఉంటే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ( Star director )తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా మన ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డు( Oscar Award ) కూడా వచ్చేలా చేసాడు.ఇక మొత్తానికైతే ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనేది ప్రూవ్ చేసుకోవాలని తను చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రణ్వీర్ సింగ్ ( Ranveer Singh ) రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఎంటైర్ కెరియర్ లో రాజమౌళితో ఒక్క సినిమా అయిన చేస్తానని శపథం చేశాడు.నిజానికి రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో రణ్వీర్ సింగ్ చాలా బాగా సెట్ అవుతాడు ఎందుకంటే రన్వీర్ సింగ్ చేసే నటన చాలా బాగుంటుందనే చెప్పాలి.ఇక అందుకే ఆయనను రాజమౌళి తన నెక్స్ట్ సినిమా చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం అయితే లేదు.