మూడు రాజధానుల అంశం ముగిసిన అధ్యాయం.బీజేపీ ఎంపీ జీవీయల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయాలు అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారిస్తాను.
రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని కొనసాగించండి.రాష్ట్ర ప్రభుత్వం కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే, రాజధాని ప్రాంతం ఓ గొప్ప నగరంగా విరాజిల్లుతుంది రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలన్నదే బీజేపీ లక్ష్యం.రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తే, అభివృద్ధి దానంతట అదే అభివృద్ధి చెందుతుంది.– జీవీయల్.రాజకీయ కారణాలతో రాజధాని ప్రాంత అభివృద్ధి అడ్డుకోవడం సరికాదు.రాజధాని అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానే ముందుకొచ్చి, రాజధాని అభివృద్ధి చేయాలి.