బారత దేశం లో ఏ ఎన్నికలలోనైనా బిజెపి( BJP ) వచ్చే ముందు ఈడి, ఐటి వంటి విచారణ సంస్థ లను ముందు పంపుతుందన్న ప్రతిపక్ష నాయకుల ఆరోపణలే నిజమైనట్లుగా తెలంగాణలో వరుస పరిణామాలు జరుగుతున్నాయి.తన పై ఈడి దాడులు జరుగుతాయన్న సమాచారం ఉందని , బీ ఆర్ ఎస్ మరియు బిజేపి కుమ్మక్కై తనపై దాడులు చేయిస్తారని ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాఖ్యానించి 24 గంటలు గడవక ముందే ఐ టి అధికారులు ఆయన తలుపు తట్టారు .
హైదరాబాదులోనూ ,ఖమ్మంలోనూ ఆయన నివాసాలు మరియు కార్యాలయాలపై ఏక దాటిన దాడులు చేశారు.గురువారం ఆయన నామినేషన్ కి ముహూర్తం ఉన్నందున ఆయనను మానసికం గా ఇబ్బందులు పెట్టేందుకే ఈ దాడులు జరిగాయని ఆయన అనుచరులు చెప్తున్నారు.
కాంగ్రెస్లో జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగల కీలక నేతల ను టార్గెట్ గా చేసుకొని అధికార బారస దాడులు చేయాలని చూస్తుందని, దానికి కేంద్ర భాజపా వంత పాడుతుందని ఈ రెండు పార్టీ లు లోపాయికారి ఒప్పందంలో ఉన్నాయన్న కాంగ్రెస్ విమర్శలకు మరింత బలం చేకూరుస్తున్నట్లుగా ఈ దాడులు జరిగాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా ఖమ్మం జిల్లా ( Khammam )గెలుపు బాధ్యతలను తన మీద వేసుకున్న పొంగులేటి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఈ తరహా దాడులకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా దుయ్యబడుతున్నాయి .అయితే ఇవి సాధారణ విధులలో భాగంగా జరిగిన దాడులే అని అధికార పక్షం ఎంత సమర్ధించుకున్నా కేవలం ఎన్నికల సమయంలో , అది కూడా ప్రతిపక్ష నాయకులను మాత్రమే టార్గెట్ చేసుకొని జరుగుతున్న దాడులు కావడం తో ఇవి పూర్తిగా రాజకీయప్రేరేపిత దాడులే అని రాజకీయ నాయకులతో పాటు సాధారణ వోటర్ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది .అయితే ఎవరెన్ని దాడులు చేసినా తాను భయపడనని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుంది అంటూ పొంగులేటి ( Ponguleti Srinivasa Reddy )స్పష్టం చేస్తున్నారు .బజపా లో చేరమని తనపై బారీ ఎత్తున ఒత్తిడి వచ్చిందని అయినా కూడా తాను కాంగ్రెస్లో చేరినందుకే తనపై కక్ష పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వంత బజాపా మద్దత్తు ఇస్తుందని సుధాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
రానున్న రోజుల్లో మరింత మంది కీలక నేతలను కేంద్రంగా చేసుకొని మరిన్ని దాడులకు కేంద్ర ,రాష్ట్ర విచారణ సంస్థలు పాల్పడవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.తాము ఓడిపోతామని బారాసాకు తెలిసిపోయిందని కాబట్టే ఈ తరహా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.