ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు.ఢిల్లీ లిక్కర్ స్కాం పాత్రధారి, సూత్రధారి రెండూ కవితేనని ఆరోపించారు.
ఈ కుంభకోణంలో ఆమెను అరెస్ట్ చేయడం ఖాయమన్నారు.కానీ ఆ అరెస్ట్ ను కూడా సానుభూతి రాజకీయాలకు కవిత వాడుకుంటారని విమర్శించారు.
తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కవిత స్పందించిన సందర్భాలు లేవని ధ్వజమెత్తారు.రాష్ట్ర మహిళా గవర్నర్ తమిళిసై గురించి బీఆర్ఎస్ నేతలు అసభ్య పదజాలం ఉపయోగించి మాట్లాడుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు.
అటువంటిది ఇప్పుడు కవిత ఢిల్లీలో మహిళల గురించి ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు.కేవలం రాజకీయాల కోసమే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని దుయ్యబట్టారు.
రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.