టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన మంచు మనోజ్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.తండ్రి మోహన్ బాబు హోదాతో సిని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
తొలిసారిగా ఈయన 2004లో దొంగ దొంగది సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించాడు.
చాలా వరకు తన నటనకు మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కూడా స్టార్ హోదాకు మాత్రం చేరుకోలేకపోయాడు.ఇక కొన్ని సినిమాలలో ఫ్లాప్ లు కూడా అందుకున్నాడు.
ఇక ప్రస్తుతం అంతగా అవకాశాలు అందుకోవటం లేదు.ఇక గత కొన్ని రోజుల నుండి ఈయన వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా మారుతున్నాడు.ఈయన 2015 మే లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకోగా కొన్ని మనస్పర్ధ కారణాలవల్ల తనకు విడాకులు ఇచ్చాడు.అలా కొంతకాలం ఒంటరిగా ఉన్న మనోజ్.
కొన్ని రోజుల నుండి భూమా మౌనిక రెడ్డితో క్లోజ్ గా ఉన్నట్లు కనిపించాడు.అయితే భూమా మౌనిక రెడ్డి ఎవరో కాదు.
తెలుగుదేశం పార్టీకి చెందిన భూమా నాగిరెడ్డి కూతురు.
అయితే గత కొన్ని రోజుల నుండి మనోజ్ ఆమెతో క్లోజ్ గా మూవ్ అయ్యాడు.ఆమెతో కలిసి ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నాడు.దీంతో ఆ సమయంలో వీరి మధ్య లవ్ నడుస్తుంది అని అందరూ అనుకున్నారు.
ఆ సమయంలో వీరిద్దరి గురించి వార్తలు కూడా జోరుగా వచ్చాయి.అంతేకాకుండా వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా బాగా వార్తలు వచ్చాయి.
ఆ సమయంలో మనోజ్ ఏమి స్పందించలేదు.కానీ కొన్ని రోజుల తర్వాత తన సోషల్ మీడియా వేదికగా త్వరలో శుభవార్త చెబుతాను అని అనటంతో బహుశా మౌనికతో తన పెళ్లి గురించి చెబుతాడేమో అని అందరూ అనుకున్నారు.అలా కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ నడిచింది అని.అంతేకాకుండా పెళ్లి చేసుకోనున్నారు అని వార్తలు కూడా వచ్చాయి.
అన్నట్టుగానే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.కానీ వీరి పెళ్లి మంచు మోహన్ బాబుకు ఇష్టం లేదని తెలిసింది.ఎందుకంటే ఇదివరకే మౌనిక కు పెళ్లి జరగక విడాకులు తీసుకుంది.అదొకటి కారణమైతే మరొకటి.తన తండ్రి తమకు వ్యతిరేక పార్టీ కావడంతో ఆయనకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని తెలిసింది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మనోజ్.
తన సోషల్ మీడియా వేదికగా మౌనిక పెళ్లి గెటప్ లో ఉన్న ఫోటో పంచుకుంటూ పెళ్లికూతురు అని పంచుకున్నాడు. అంతేకాకుండా మనోజ్ వెడ్స్ మౌనిక అంటూ క్యాప్షన్ లో పెట్టాడు.
ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవ్వగా అందరూ శుభాకాంక్షలు తెలిపారు.కొంతమంది నెగటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
ఓ నెటిజన్ మాత్రం.ఓకే బ్రో విడాకులు వచ్చే సంవత్సరమా అంటూ షాకిచ్చాడు.
ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.