గత కొద్దీ రోజులుగా బీహార్ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ కు దాదాపు తెరపడింది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ,జేడీయూ సారధ్యంలోని ఎన్డీయే కూటమి తన హవా కొనసాగిస్తుంది.
ఆర్జేడీ మహా కూటమి కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ ను తారుమారు చేస్తూ ఎన్డీయే కూటమి తిరిగి మరోసారి అక్కడ జెండా ఎగురవేయనుంది.రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎన్డీయే కూటమికి 125 సీట్లలో ఆధిక్యం/గెలుపు ఉంది.
దీనితో బీహార్ లో మరోసారి ఎన్డీయే నే పవర్ లోకి రావడం ఖాయమని స్పష్టంగా అర్ధం అవుతుంది.ఐతే ఈ ఎన్నికల్లో బీజేపీ 73 సీట్లు సాధించేలా కనిపిస్తుండడం తో ఆ పార్టీ బీహార్ లో అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనితో బీజేపీ,జేడీయూ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ అసలు తదుపరి సీఎం ఎవరా అన్న సంగతి ఆసక్తికరంగా మారింది.ఇప్పటివరకైతే బీజేపీ తదుపరి సీఎం ఎవరు అన్న అంశంపై ఎలాంటి ప్రకటన చెయ్యలేదు కానీ,అతిపెద్ద పార్టీ గా అవతరించడం తో అసలు తదుపరి సీఎం గా నితీష్ కుమార్ నే కొనసాగిస్తుందా లేదంటే కొత్త సీఎం పేరు బయటకు వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీ… 20 సీట్లను పెంచుకొని 73 సీట్లు సాధించేలా కనిపిస్తోంది.అదే సమయంలో… జేడీయూ… 24 సీట్లు కోల్పోయి… 47 స్థానాలకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది.
నితీశ్ పాలన నచ్చకపోవడం వల్లే ప్రజలు జేడీయూని వ్యతిరేకరించారనీ… అదే సమయంలో… కేంద్రంలోని బీజేపీ పాలన నచ్చడం వల్లే… రాష్ట్రంలో కూడా బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు కనిపిస్తోంది.ఈ పరిస్థితుల్లో బీజేపీ… మళ్లీ నితీశ్‌కుమార్‌కి సీఎం అయ్యే ఛాన్స్ ఇస్తుందని అనుకోలేం.
కాకపోతే వ్యక్తిగతంగా నితీశ్ కుమార్‌కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.అదొక్కటే ఆయన మళ్లీ సీఎం అయ్యేందుకు అవకాశం కల్పిస్తోంది.
మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే మరికొంత సమయం వేచిచూడాల్సిందే.