వాటే క్యాచ్.. క్రికెట్ చరిత్రలోనే ఇది చాలా స్పెషల్.. వైరల్ వీడియో చూసేయండి..

తాజాగా టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరిగిన విషయం తెలిసిందే.ఇందులో భారత్ శ్రీలంక జట్టును చిత్తు చిత్తుగా ఓడించి మూడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది.

 Binura Fernando Superb Catch In India Vs Srilanka Third T20 Details, Catch, Spor-TeluguStop.com

అయితే క్లీన్‌స్వీప్‌ అయినప్పటికీ ఈ సిరీస్ లో రెండు జట్లు పోటాపోటీగా ఆడి ప్రేక్షకులను బాగా ఎంట‌ర్‌టైన్ చేశాయి.టీమిండియా తరఫున యువ బ్యాటర్లు చెలరేగి ఆడారు.

ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్ తో మొత్తంగా 204 పరుగులు సాధించి వన్ మ్యాన్ షో అంటే ఏంటో చూపించాడు.

అయితే శ్రీలంక ప్లేయర్లు కూడా ఇందులో రాణించారు.

ముఖ్యంగా ఫీల్డింగ్ లో అదరగొట్టారు.బినురా ఫెర్నాండో పట్టిన క్యాచ్ ఈ సిరీస్ మొత్తంలో హైలెట్ అయ్యింది.

ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ధర్మశాల వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన క్యాచ్ వెలుగు చూసింది.టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 13వ ఓవర్‌ బౌల్ చేశాడు లాహిరు కుమార.13వ ఓవర్లో ఒక బంతిని సంజు శాంసన్ భారీ షాట్‌ ఆడటంతో అది మిస్ అయింది.దీంతో అది ఎడ్జ్‌ తీసుకొని ఫీల్డర్ ఫెర్నాండో వైపు దూసుకెళ్లింది.చాలా ఎత్తుకు ఎగిరిన ఈ బంతిని పట్టుకోవడం అసాధ్యం అని అందరూ అనుకున్నారు.కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఫెర్నాండో అద్భుతంగా బంతిని క్యాచ్ పట్టుకున్నాడు.అతడు గాల్లో ఎగిరి ఒంటి చేత్తో బంతిని క్యాచ్ పట్టుకున్నాడు.

దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.

అప్పటికే 39 పరుగులు చేసి శాంసన్‌ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.ఈ నేపథ్యంలో అతడిని అనూహ్యంగా ఇంటికి పంపించి వావ్ అనిపించాడు ఫెర్నాండో! అయితే ఇంత మంచిగా క్యాచ్ పట్టినప్పటికీ శ్రీలంక జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.తొలత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 183 స్కోరు సాధించింది.అయితే టీమ్ ఇండియా కేవలం 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube