సిబ్బందికి అధునాతన వైద్య సేవలు అందించాలని మంత్రి పువ్వాడ ఆదేశం.ఆసుపత్రిని సందర్శించిన సంస్ధ MD సజ్జనార్ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని టి.
ఎన్.ఆర్టీసీ తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ తరహాలో యుద్ధ ప్రాతిపదికన ఆధునీకరించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అదేశించారు.ఇటీవలే మంత్రి పువ్వాడ తార్నాక ఆసుపత్రిలో ICU, డయాలసిస్ యూనిట్స్, రోగ నిరోధక అధునతన పరికరాలు ప్రారంభించారు.అందులో భాగంగా సంస్థ ఉద్యోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని నిర్ణయించారు.
అందులో భాగంగా పలు వైద్య సేవలు జరుగుతోందని సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ తార్నాక ఆసుపత్రిలో సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు, శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనలతో ఈ ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్యం అందించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ఉద్యోగులకు భరోసా కల్పించారు.
అక్కడి వైద్య విభాగాలను ఒక్కొక్కటిగా పరిశీస్తూ సిబ్బందికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.ఇన్ పేషంట్, అవుట్ పేషంట్ వార్డులను పరిశీలించారు .ముఖ్యంగా ఇటీవల నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఐ.సి.యు , డయాలసిస్ యూనిట్లలో అందుతున్న సేవలను గమనించి అక్కడ చికిత్స పొందుతున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.అనంతరం ఎం.డి సమీక్షా సమావేశం నిర్వహించి వైద్యాధికారులతో వైద్య సేవలపై కూలంకషంగా చర్చించారు .
సంస్థలోని 46 వేలకు పైగా ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 2 లక్షల మంది దాకా తార్నాక ఆసుపత్రిలో సేవలు పొందుతున్నట్లు అక్కడి వైద్యలు ఎం.డికి వివరించారు.రోజూ దాదాపు వెయ్యి మందికి ఒపి చూడటం జరుగుతోందన్నారు.
గత ఆరు నెలల కాలంలో ఐ.సి.యులో 622 మందికి చికిత్స, రోజు మర్చి రోజు వారీగా నెలలో 28 మంది డయాలసిస్ సేవలు పొందుతున్నట్లు గణాంకాల ద్వారా వివరించారు.నెలలో సుమారు 4 వేలకు పైగా బ్లడ్ టెస్టులతో పాటు రోజూ 10 సర్జరీలు జరుగుతున్నట్లు తెలిపారు 200 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం 15 బెడ్లతో ఐ.సి.యు, 6 బెడ్లతో డయాలసిస్, మరో 6 బెడ్ లతో అత్యవసర చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు.
సంస్థ సిబ్బంది, ఉద్యోగులకు ప్రత్యేకంగా వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యల విషయంలో అవసరమైన మేర వైద్య సేవల్ని అందించాలని ఎం.డి సజ్జనార్ డాక్టర్లకు సూచించారు.మందుల కొరత లేకుండా సరిపడా మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.సిబ్బందితో పాటు బయటి రోగులకు కూడా నామమాత్రపు ఫీజుతో వైద్య చికిత్సలు అందుబాటులోకి తీసుకువచ్చిన వైనాన్ని గుర్తు చేశారు.
ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ కూడా బాగుంటుందని, అందుకోసం వారి వైద్యం సేవలకై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్ళి ఆసుపత్రి ఆధునీకరణలో భాగంగా త్వరలో 4 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక చర్చలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.ఈ సమావేశంలో తార్నాక ఆసుపత్రి ఒ.ఎన్.డి వి.ఎస్.రెడ్డి, సూపరింటెండెంట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ శైలజామూర్తి , సీనియర్ వైద్యాధికారి శ్రీనివాస్ , తదితర డాక్టర్లు పాల్గొన్నారు .