బాలయ్య వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన చెన్నకేశవ రెడ్డి సినిమా సక్సెస్ సాధించినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.వీవీ వినాయక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
నిర్మాత గిరితో నాకు చనువు ఎక్కువని ఆయన తెలిపారు.దిల్ సినిమా తర్వాత దిల్ రాజు గారితో పని చేయకపోవడం గురించి వినాయక్ మాట్లాడుతూ దిల్ సినిమాకు పని చేసిన వాళ్లే దిల్ రాజు బ్యానర్ లో డైరెక్టర్లు అయ్యారని తెలిపారు.
ఒక ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్లతో చేయడం అలవాటు పడితే ఎంతో కంఫర్ట్ ఉంటుందని ఆయన తెలిపారు.దిల్ రాజు బ్యానర్ అంటే నా ఓన్ బ్యానర్ అని ఆయన చెప్పుకొచ్చారు.
రామ్ ప్రసాద్ నాకు బాగా క్లోజ్ అని క్రాంతి గారి దగ్గర మేమిద్దరం కలిసి పని చేశామని వినాయక్ అన్నారు.ఆది సినిమాకు రామ్ ప్రసాద్ మొదట ఓకే చెప్పి తర్వాత వేరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫీలయ్యానే తప్ప అంతకు మించి రామ్ ప్రసాద్ తో నాకు డిఫరెన్సెస్ లేవని ఆయన తెలిపారు.
నా సినిమాలలో ఎక్కువ సినిమాలకు ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారని వినాయక్ వెల్లడించారు.
చెన్నకేశవరెడ్డి ఇప్పటికీ అభిమానులకు చాలా ఇష్టమైన మూవీ అని ఆయన చెప్పుకొచ్చారు.బాలయ్య బాబు ఎక్కడ కనిపించిన సత్తిరెడ్డి అని అంటారని వినాయక్ కామెంట్లు చేశారు.బాలయ్యతో మరో సినిమా చేయాలని అనుకునా కుదరలేదని ఆ విధంగా ప్రపోజల్స్ రాలేదని వినాయక్ చెప్పుకొచ్చారు.
ఇంటెలిజెంట్ తర్వాత బాలయ్యతో ఒక సినిమా చేయాలని అనుకున్నామని కానీ కథ కుదరలేదని వినాయక్ తెలిపారు.ఒక పాత్రగా చూడాలని నేను భావించానని ఆ సినిమా డైరెక్టర్ నన్ను హీరోగా చూడాలని అనుకున్నారని అయితే ఆ సినిమా ఆగిపోవడం కూడా మంచికే అని వినాయక్ కామెంట్లు చేశారు.