గలిజేరు ఆకుల వల్ల ఎన్ని లాభాలంటే...!?

మన ఇంటి చుట్టూ పక్కల ఏదన్నా కాళీ ప్రదేశం ఉంటే చాలు పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటాయి.అందులో ప్రధానంగా మొలిచే మొక్క ఏదన్నా ఉంది అంటే అది గలిజేరు మొక్క అనే చెప్పాలి.

 Wonderful Health Benefits Of Theela Galijeru Leaves, Theela Galijeru Leaves, Kid-TeluguStop.com

ఖాళీ ప్రదేశాలు, పల్లెప్రాంతాల్లో ఈ మొక్కలు విరివిగా పెరుగుతాయి .అయితే చాలా మంది ఈ మొక్కలను చూసి పిచ్చిమొక్కలుగా అనుకుంటారు.కానీ నిజానికి ఈ మొక్కల్లో ఉన్న ఔషధగుణాల గురించి తెలిస్తే ఆ మొక్క ఎక్కడ ఉందా.అని వెతుకుంటూ వెళ్లి మరి ఇంటికి తెచ్చుకుంటారు. గలిజేరు మొక్కని ఔషధాల గని అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.గలిజేరు మొక్కను ఆయుర్వేదం ప్రకారం పునర్నవ అంటారు.

దీని సైంటిఫిక్ నేమ్ బోరేవియా డిఫ్యూసా.దీన్ని భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో విరివిగా ఉపయోగిస్తుంటారు.

ఇకపోతే ఈ మొక్క విషయానికి వస్తే ఇది మామూలుగా తీగజాతి మొక్క.తెలుపు ఎరుపు మరియు నలుపు రంగుల్లో మనకి కనిపిస్తుంది.

మరి ఈ మొక్క వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.!

తెల్ల గలిజేరు ఆకులను వేడి నీటిలో మరిగించి వడగట్టి ఆ నీటిని తాగడం వలన గొంతులో కఫము,దగ్గు తగ్గుతుంది.

అలాగే జీర్ణ కోస సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి.ఈ నీటిని తాగడం వలన మూత్రపిండాల పనితీరు కూడా మెరుగుపడుతుంది.తెల్లగలిజేరు వేరును నీటిలో అరగతీసి కంటికి పెడితే రేచీకటి తొలగిపోయి కంటి చూపు మెరుగు పడుతుంది.అలాగే గలిజేరు ఆకుని కూర వండుకుని తింటే మన శరీరంలో ఉన్న రక్తం శుద్ధి అవుతుంది.

అంతేకాకుండా తెల్లగలిజేరు వేరు, నీరు, పాలు సమంగా కలిపి పొయ్యి మీద పెట్టి మరిగించి తరువాత వడకట్టి తాగితే సర్వ జ్వరాలు హరిస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నది.

Telugu Pressure, Benefits, Care, Tips, Heart, Kidney Problems, Scars, Theela Gal

అంతేకాకుండా ఈ మొక్క వలన ఆడవాళ్ళ శరీర అందం కూడా రెట్టింపు అవుతుంది.తెల్ల గలిజేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి.అలాగే కొంతమంది పిల్లలు వయసు పెరుగుతున్న కొద్ది నడవలేరు.

అలాంటి వారికీ తెల్ల గలిజేరు తైలం మంచిగా ఉపయోగపడుతుంది.ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆకు కూరని అధికంగా తినకూడదు.

ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవాళ్లు.అలాగే షుగర్, బిపి ఉన్నవారు చలువ చేసే పదార్ధాలు అధికంగా తింటూ ఈ ఆకు కూరని మితంగా తినాలి.

అలాగే గర్భవతులు, పాలిచ్చే తల్లులు ఈ ఆకు కూర తినకుండా ఉంటే మంచిది.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube