చూయింగ్ గమ్ నమలడం చాలా మందికి ఉన్న కామన్ అలవాటు.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కోట్ల మంది తరచూ చూయింగ్ గమ్ నములుతుంటారు.
అయితే పెద్దలు మాత్రం చూయింగ్ గమ్ నమలడం ఆరోగ్యానికి మంచిది కాదని.ఒకవేళ దానిని పొరపాటున మింగేస్తే కడుపులో పేగులు అతుక్కుపోతాయని ఏవేవో చెబుతుంటారు.
కానీ, ఇవన్నీ అపోహలు మాత్రమే.వాస్తవానికి చూయింగ్ గమ్ నమలడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి.
ముఖ్యంగా బరువు తగ్గేందుకు చూయింగ్ గమ్ అద్భుతంగా సహాయపడుతుంది.నేటి కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు.అయితే చూయింగ్ గమ్ తింటూ నడవడం వల్ల అధిక బరువును నియంత్రించుకోవచ్చని పరిశోధకలు బలంగా చెబుతున్నారు.అదెలా అంటే.
నడుస్తూ చూయింగ్ గమ్ తింటుంటే.గుండె పని తీరు మెరుగుపడటంతో పాటుగా నడకలో వేగం పెరుగుతుందట.
దాంతో అదనపు కేలరీలు ఖర్చు అవుతాయి.ఫలితంగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అలాగే చూయింగ్ గమ్ నమలడం వల్ల ఆకలి తగ్గుతుంది.దాంతో తక్కువగా ఆహారం తీసుకుంటారు.సో.ఇలా కూడా బరువు తగ్గొచ్చు.ఇక చూయింగ్ గమ్ నమలడం వల్ల మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.ప్రతి రోజూ చూయింగ్ గమ్ నమలడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడి.బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది.ప్రతి పనిపై ఏకాగ్రత్త కూడా పెరుగుతుంది.
ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు చూయింగ్ గమ్ తింటే.త్వరగా రిలీఫ్ అవుతారు.నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ చూయింగ్ గమ్ గ్రేట్‌గా సహాయపడుతుంది.ముఖ్యంగా చూయింగ్ గమ్ నమలడం వల్ల దంత క్షయానికి చెక్ పెట్టవచ్చు.
అయితే చూయింగ్ గమ్ నమలడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.అతిగా మాత్రం తీసుకోకూడదు.
మరియు షుగర్‌లెస్ చూయింగ్ గమ్స్‌ను మాత్రమే ఎంచుకోవాలి.