ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సినిమాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఏదనే ప్రశ్నకు జైలర్ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది.నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Dilipkumar ) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలు చేయగా ఆ పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయితే బాలయ్య కూడా ఈ సినిమాలో నటించాల్సి ఉందని తెలుస్తోంది.స్వయంగా నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాలను వెల్లడించారు.
ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం బాలయ్యను తీసుకోవాలని అనుకున్నానని కానీ అది సాధ్యం కాలేదని అన్నారు.తెరపై రజనీకాంత్ మాత్రమే కనిపిస్తే జోష్ వస్తుందని అందుకే ఈ సినిమాను మల్టీస్టారర్ గా తీయాలని అనుకోలేదని నెల్సన్ చెప్పుకొచ్చారు.
స్పెషల్ అట్రాక్షన్ కోసమే మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లను ఈ సినిమా కోసం తీసుకోవడం జరిగిందని నెల్సన్ చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో పోలీస్ రోల్ కోసం బాలయ్యను అనుకున్నామని అయితే కథకు అనుగుణంగా ఆయన పాత్రను సరిగ్గా డిజైన్ చేయలేకపోయామని నెల్సన్ కామెంట్లు చేశారు.అందువల్ల ఆయనను ఎంపిక చేయడం సరికాదని అనిపించిందని నెల్సన్ చెప్పుకొచ్చారు.ఈ రీజన్ వల్లే జైలర్ సినిమాలో గెస్ట్ రోల్ కోసం బాలయ్య( Balakrishna )ను కలవలేదని ఆయన కామెంట్లు చేశారు.
భవిష్యత్తులో బాలయ్యతో సినిమా చేస్తానేమో అని నెల్సన్ వెల్లడించారు.
మరోవైపు జైలర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.72 సంవత్సరాల వయస్సులో కూడా అద్భుతమైన ఎనర్జీ లెవెల్స్ తో రజనీకాంత్( Rajinikanth ) బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు.రజనీకాంత్ తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.
జైలర్ మూవీ కలెక్షన్లు అదుర్స్ అనే విధంగా ఉండటం గమనార్హం.