తారక్ స్టార్ హీరో కావడానికి ఆ విధంగా బాలయ్యే కారణమా.. ఏం జరిగిందంటే?

నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.అటు బాలయ్య ఇటు తారక్ లలో ఎవరో ఒకరు ఈ ప్రాజెక్ట్ దిశగా అడుగులు వేస్తే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కడం కష్టం కాదని చెప్పవచ్చు.

 Balakrishna Is The Reason For Young Tiger Junior Ntr Success In Career Details H-TeluguStop.com

ఈ ఇద్దరు హీరోలు ఓకే చెబితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు సైతం వీళ్ల కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ ను అందుకోవడానికి ఒక విధంగా బాలకృష్ణే కారణం కావడం గమనార్హం.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా బాలయ్య రిజెక్ట్ చేసిన రెండు సినిమాలు తారక్ పాలిట వరంగా మారాయి.యంగ్ టైగర్ వి.వి.వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా ఆది అనే సంగతి తెలిసిందే.అయితే వినాయక్ మొదట తారక్ తో లవ్ స్టోరీ తెరకెక్కించాలని అనుకున్నారు.

అయితే మాస్ ఇమేజ్ పై దృష్టి పెట్టిన తారక్ కొడాలి నాని సూచన మేరకు లవ్ స్టోరీని రిజెక్ట్ చేయగా బాలయ్య కోసం తయారు చేసిన రెండు సీన్లను వినాయక్ తారక్ కు చెప్పి ఒప్పించారు.

ఆ తర్వాత వినాయక్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసి తారక్ తో ఆది సినిమా తెరకెక్కించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ విధంగా బాలయ్య కోసం తయారు చేసిన కథలో తారక్ నటించి సక్సెస్ సాధించారు.

Telugu Aadi, Balakrishna, Simhadri, Tarak-Movie

బాలయ్య బి.గోపాల్ కాంబోలో సింహాద్రి సినిమా తెరకెక్కాల్సి ఉండగా బాలకృష్ణ సింహాద్రి తరహా నేపథ్యానికి సంబంధించిన కథలలో గతంలో నటించడంతో ఈ సినిమాకు నో చెప్పారని పరుచూరి గోపాలకృష్ణ ఒక సందర్భంలో తెలిపారు.ఆ తర్వాత రాజమౌళి ఇదే స్క్రిప్ట్ తో తారక్ తో సినిమాను తెరకెక్కించడం సినిమా సక్సెస్ సాధించడం జరిగాయి.ఈ విధంగా రెండు సందర్భాల్లో తారక్ సక్సెస్ సాధించడానికి బాలయ్య కారణమయ్యారని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube