దేశం కాని దేశం వెళ్లి అక్కడ ఉన్నత చదువులు చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి తమ కుటుంబ సభ్యులను కంటికి రెప్పలా చూసుకోవాలని కలలు కన్న ముగ్గురు భారతీయ విద్యార్ధుల కధ విషాదంగా ముగిసింది.ఇందులో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు కాగా, మరొకరు బెంగుళూరు కి చెందిన విద్యార్ధులు కావడం గమనార్హం.
మరొక తెలుగు విద్యార్ధి ఆసుపత్రిలో కొన ఊపిరితో ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నా అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు.ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వెనుక అసలేం జరిగిందంటే.
లండన్ లోని స్కాట్లాండ్ లో గల హైల్యాండ్ లోని అప్పిన్ ప్రాంతంలో ఆగస్టు 19 తేదీన ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.విహార యాత్రకని బయలు దేరిన తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు పవన్ (హైదరాబాద్ ) , సుధాకర్ ( నెల్లూరు) సుబ్రహ్మణ్యం ( బెంగుళూరు ) , హైదరాబాద్ కే చెందిన మరో విద్యార్ధి సాయి వర్మ ఈ నలుగురుని వెనుక నుంచీ వేగంగా వస్తున్న ఓ భారీ వాహనం డీ కొట్టి ఉండవచ్చునని ఘటన స్థలాన్ని పరిశీలించిన స్కాట్లాండ్ పోలీసులు వెల్లడించారు.
ముగ్గురు విద్యార్ధులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా హైదరాబాద్ కి చెందిన మరో విద్యార్ధి సాయి వర్మ కి తీవ్ర గాయాలు అయ్యాయని పరిస్థితి క్రిటికల్ గా ఉండటంతోఆసుపత్రిలో చేర్చామని పోలీసులు తెలిపారు.ఇదిలాఉంటే.
ఈ ఘటనకు సంభందించి కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సిసి టీవి పుటేజ్ లను పరిశీలించిన పోలీసులు 47 ఏళ్ళ వ్యక్తిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు.
కాగా ఈ ఘటన జరిగిన సమయంలో చూసిన ప్రత్యక్ష సాక్ష్యులు ఎవరైనా ఉంటే వారు తమకు సమాచారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.చనిపోయిన వారి మృత దేహాలను భారత్ లోని కుటుంబ సభ్యులకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ విషయంలో స్థానికంగా ఉన్న తెలుగు సంఘాలు సైతం తమకు సహకరిస్తున్నాయని ఓ పోలీసు అధికారి ప్రకటించారు.