బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉంటాయనే సంగతి తెలిసిందే.బోయపాటి శ్రీను మాత్రమే బాలకృష్ణకు సరిపోయే కథలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ లో చాలామంది భావిస్తారు.
బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ మూవీ మే 28వ తేదీన విడుదల కానుండగా ఈ సినిమా టైటిల్ గురించి అనేక వార్తలు వైరల్ అయ్యాయి.ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది.
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.బాలకృష్ణ, బోయపాటి శ్రీను గత సినిమాలు సింహా, లెజెండ్ లాంటి టైటిల్స్ తో తెరకెక్కి సక్సెస్ సాధించగా గాడ్ ఫాదర్ అనే పవర్ ఫుల్ టైటిల్ కూడా బాలకృష్ణకు సక్సెస్ ఇస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
లెజెండ్ తరువాత బాలకృష్ణ నటించిన సినిమాలేవీ ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు.ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
ఒక పాత్రలో బాలయ్య అఘోరాగా కనిపించనుండగా అఘోరా పాత్ర సినిమాకే హైలెట్ అవుతుందని ఆ పాత్రలో బాలకృష్ణ నటన అద్భుతంగా ఉండనుందని సమాచారం.ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు సైతం భారీగా పోటీ నెలకొంది.బాలయ్య ఫ్యాన్స్ సైతం గాడ్ ఫాదర్ టైటిల్ బాగుందని అభిప్రాయపడుతున్నారు.అయితే టైటిల్ కు సంబంధించి చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.కథను బట్టి టైటిల్స్ పెట్టే బోయపాటి శ్రీను గాడ్ ఫాదర్ టైటిల్ పెట్టారంటే కథ ఏ రేంజ్ లో ఉంటుందో అని బాలయ్య ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
బీబీ3 ఫస్ట్ రోర్ పేరుతో గతేడాది బాలయ్య పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ విడుదల చేసిన టీజర్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.
బాలయ్య సినీ కెరీర్ లో కలెక్షన్ల పరంగా గాడ్ ఫాదర్ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.