వయసు గురించి మాట్లాడితే ముసలి హీరోల అభిమానులకు ఈగో హర్ట్ అవ్వచ్చు.కానీ వయసు ఎవరికి తగ్గదుగా.
అలాగే ప్రస్తుతం బాలకృష్ణ( Balakrishna ) వయసు గురించి మాట్లాడితే కూడా బాలయ్య అభిమానులకు కోపం వచ్చినా సరే ఉన్నవాస్తవం మాట్లాడుకోవాల్సిందే.ప్రస్తుతం బాలయ్యకు 63 ఏళ్లు.కానీ బాలయ్య హిట్స్ అందుకుంటున్న విధానం చూస్తే ఇది బాలయ్య 2.0 వెర్షన్ అనే ఖచ్చితంగా చెప్పొచ్చు.దాదాపు చాలా ఏళ్ల తర్వాత ఆయనకు అఖండ సినిమాతో( Akhanda ) మంచి విజయం దక్కింది.ఒక మాటలో చెప్పాలంటే లెజెండ్ సినిమా తర్వాత ఆయన అఖండ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
అక్కడి నుంచి మొదలెట్టినా బాలయ్య బాబు ఉగ్రరూపం నిన్న మొన్నటి భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) వరకు కొనసాగింది.ప్రస్తుతం ఆయన తన 109 వ సినిమాను కూడా ప్రకటించారు.ఇంకా దాని గురించి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.అఖండ సినిమా తర్వాత వీరసింహా రెడ్డి( Veerasimha Reddy ) సైతం బాలకృష్ణకు మంచి విజయాన్ని ఇచ్చింది.
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సైతం ఆయనకు తిరుగు లేదు అని మరోమారు నిరూపించింది.అలా అఖండ సినిమాతో ఆయన విజయాల పరంపర మొదలయ్యింది.
ప్రస్తుతం బాలకృష్ణ మీద 100 కోట్లకు పైగా డబ్బులు పెట్టడానికి చాలా మంది నిర్మాతలు క్యూలో ఉన్నారు.బాలకృష్ణ మాదిరిగానే తమిళ్ లో లోకనాయకుడు కమల్ హాసన్( Kamal Haasan ) సైతం దాదాపు చాలా ఏళ్ల తర్వాత విక్రమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.
ఈ సినిమా ఆయనకు చాలా మంచి బూస్టింగ్ ఇవ్వగా, ఆ తర్వాత దాదాపు మూడు భారీ యాక్షన్ సినిమాలను సైతం ఆయన ప్రకటించారు.అన్ని కూడా 200 కోట్ల ఒక పైగా బడ్జెట్ తో కూడిన సినిమాలు కావడం విశేషం.ఇలా ఇక్కడ బాలకృష్ణ మరియు అక్కడ కమల్ హాసన్ ఇద్దరూ కూడా 60 ఏళ్ల పైబడిన వారే.అలాగే వీరు వరుస విజయాలు అందుకుంటూ దూకుడు స్వభావంతో సినిమాలు కూడా చేస్తున్నారు.
ఇక వీళ్ళను చూసి కుర్ర హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ సదరు హీరోల అభిమానులు సెటైర్స్ వేస్తున్నారు.