Samarasimha Reddy Re Release : బాలయ్యకు ఘోర అవమానం.. సమరసింహారెడ్డి మూవీ రీరిలీజ్ ను అభిమానులు పట్టించుకోలేదా?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్( Re Release Trend ) నడుస్తున్న విషయం తెలిసిందే.గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్.

 Balakrihna Samara Simha Reddy Re Release Failed To Get A Minimum Audience-TeluguStop.com

ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు.

పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది.కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.

Telugu Gopal, Balakrishna, Tollywood-Movie

రీసెంట్ గా రవితేజ( Raviteja ) సూపర్ హిట్ మూవీ వెంకీ థియేటర్స్ లోకి వచ్చి డీసెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.అయితే కిక్ అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు.తాజాగా సమరసింహారెడ్డి( Samarasimha Reddy ) చిత్రం కూడా 4కె వెర్షన్స్ లో క్వాలిటీ అవుట్ పుట్ తో థియేటర్స్ లోకి వచ్చింది.మొదటి రోజు తమ అభిమాన హీరోల సినిమాలు చూడటానికి ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు.

టాలీవుడ్ కి ఫ్యాక్షన్ ట్రెండ్ ని పరిచయం చేసిన సమరసింహారెడ్డి మూవీ రీరిలీజ్( Samarasimha Reddy Re Release ) బాగానే వర్కవుట్ అయ్యిందా? సమరసింహా రెడ్డి సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాత క్రియేషన్స్ వారు రీ రిలీజ్ చేశారు.బాగా ఖర్చుపెట్టి 4కె లో అదిరిపోయే క్వాలిటీలో రిలీజ్ కు తెచ్చారు.

అయితే అనుకున్న స్దాయిలో రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి.మార్చి 2న రిలీజ ఈ రీరిలీజ్‌ చిత్రాన్ని అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న 3-4 షోలను మినహాయిస్తే మిగతా షోలకు జనం చెప్పుకోదగిన స్దాయిలో లేరు.

Telugu Gopal, Balakrishna, Tollywood-Movie

చెన్న కేశవ రెడ్డి రీ-రిలీజ్( Chennakkeshava Reddy Re Release ) కు వచ్చిన రెస్పాన్స్ లో 10% రాలేదని ట్రేడ్ అంటోంది.వాస్తవానికి రీమాస్టరింగ్ కోసం టీమ్ చాలా డబ్బు ఖర్చుపెట్టారు.క్వాలిటీ బాగన్నా కూడా ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు.ఇటీవలి కాలంలో ఓయ్ రిలీజ్ మాత్రమే మంచి వసూళ్లు రాబట్టడంతో మిగతా సినిమాలన్నీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా పెద్దగా పట్టించుకున్న థాకలాలు లేవు.

ఇటీవల విడుదలైన కిక్ 4కె వెర్షన్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

Telugu Gopal, Balakrishna, Tollywood-Movie

అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలను ఉర్రుతలూగించిన ఈ చిత్రం బి.గోపాల్( B Gopal ) దర్శకత్వంలో రూపొందింది.ఫ్యాక్షన్‌ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఆ తరువాత ఫ్యాక్షన్‌ సినిమాలకు శ్రీకారం చుట్టింది.1999లో సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది.విడుదలైన అన్ని ఏరియాల్లో బక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగించి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌( Biggest Industry Hit )గా నిలిచింది.

ఫ్యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన సమరసింహారెడ్డి ని విడుదలైన 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ సినిమాను ఆయన అభిమానులు 4కె లో విడుదల చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube