ఈ ఏడాది జరిగినటువంటి ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు ( Oscar Award )వచ్చిన విషయం మనకు తెలిసిందే.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
అయితే ఇలా మొదటిసారి ఒక తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు సినీ సెలబ్రిటీలందరూ ఎంతో గర్వపడ్డారు.అయితే వచ్చేయడాది ఆస్కార్ ప్రధానోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఆస్కార్ అధికారిక ఎంట్రీ కోసం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రెండు సినిమాలు ఎంపిక అయ్యాయని తెలుస్తుంది.
వచ్చే ఏడాది ప్రకటించబోయే ఆస్కార్ కి ఏ సినిమా అధికారికంగా పంపాలి అనే విషయంలో ప్రక్రియ మొదలైన క్రమంలో గిరీష్ కాసరవెల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన కమిటీ చెన్నైలో పని మొదలెట్టిందని తెలుస్తుంది.ఈ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా 22 సినిమాలను ఎంపిక చేయక అందులో రెండు తెలుగు సినిమాలు ఉండటం విశేషం.మరి ఈ రెండు తెలుగు సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే నాని కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి చిత్రం దసరా ( Dasara ) ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.
ఇక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కి ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయాన్ని అందుకున్నటువంటి చిత్రం బలగం( Balagam ) .ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమాని ఆస్కార్ అధికారిక ఎంట్రీలో భాగంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇలా తెలుగులో ఈ రెండు సినిమాలు ఆస్కార్ అవార్డుకు ఎంపిక కావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 22 సినిమాలలో ఏ సినిమా అధికారకంగా ఆస్కార్ ఎంట్రీ దక్కించుకుంటుందనే విషయం తెలియాల్సి ఉంది.