తమిళనాడు డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.సనాతన ధర్మంపై ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.
ఈ క్రమంలో ఉదయనిధి స్టాలిన్ తో పాటు తమిళనాడు ప్రభుత్వానికి కూడా అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.అయితే సనాతన ధర్మం మలేరియా, డెంగీ వ్యాధుల లాంటిదన్న మంత్రి ఉదయనిధి స్టాలిన్ దాన్ని వ్యతిరేకిస్తే సరిపోదని, పూర్తిగా నిర్మూలించాల్సిందేనని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.