ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం బేబీ.( Baby Movie ) ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అంతేకాకుండా కలెక్షన్ ల సునామీని సృష్టించింది.ఈ సినిమా తర్వాత కొద్ది రోజులపాటు వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) ఆనంద్ దేవరకొండల( Anand Deverakonda ) పేర్లు మారు మోగి పోయాయి.
ఇది ఇలా ఉండే తాజాగా సోషల్ మీడియాలో మరోసారి ఈ జంట పేరులో మారుమోగుతున్నాయి.అందుకు గల కారణం కూడా లేకపోలేదు.వైష్ణవీ చైతన్య, ఆనంద్ దేవరకొండ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది.వీరిద్దరు కలిసి మరో సినిమాలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.తాజాగా మూవీ మేకర్స్ అదే విషయాన్ని తెలిపింది.ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ఆసక్తి రేకెత్తించేలా ఉంది.ఆ పోస్టర్‌లో ఏడుస్తూ ఉన్న వైష్ణవిని ఆనంద్ ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.విభిన్న ప్రేమకథతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది.బేబీ దర్శకుడు సాయి రాజేశ్( Sai Rajesh ) ఈ కొత్త సినిమాకి కథ అందించారు.అలాగే బేబీ నిర్మాత ఎస్‌కేఎన్‌తో కలిసి ఈ చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు.3 రోజెస్ వెబ్‌సిరీస్‌కు రచయితగా, ప్రతిరోజూ పండగే మూవీకు కో రైటర్, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన రవి నంబూరి( Ravi Namburi ) ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు.
టైటిల్ ఇంకా ఖరారుకాని ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు.బేబీ లాంటి హిట్ మూవీలో హీరోహీరోయిన్ లుగా నటించిన జంట మరో సినిమాలో నటిస్తున్నారంటే సాధారణంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది.వారితోపాటు బేబీ మూవీ దర్శకుడు, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ కూడా భాగస్వాములు కావడంతో కొత్త ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.కాగా వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.