షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. మూడు రెట్ల సమర్ధతతో కొత్త మాగ్నటిక్‌ జెల్‌

షుగర్(డయాబెటిస్) అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య అని చెప్పవచ్చు.ఒక్కసారి ఈ వ్యాధి వచ్చిందంటే ఎప్పటికీ నయం కాదని అందరికీ తెలిసిందే.

 Good News For Sugar Patients New Magnetic Gel With Three Times Efficiency, Good-TeluguStop.com

మధుమేహాన్ని పూర్తిగా నయం చేసే చికిత్స ఇప్పటికీ లేదనే చెప్పుకోవాలి.కేవలం షుగర్ లక్షణాలను మాత్రమే తగ్గించుకోగలం.

కానీ తర్వాత మళ్లీ జాగ్రత్తలు పాటించకపోతే వచ్చే అకకాశముంది.ఒక్కసారి షుగర్( Sugar ) వచ్చిందంటే.

లెవల్స్ తగ్గించుకునేందుకు డైటింగ్, వ్యాయామాలు లాంటివి చేయాల్సి ఉంటుంది.ఏవి పడితే అవి తినడానికి కూడా కుదరదు.

Telugu Magnetic Gel, Sugar, Latest-Latest News - Telugu

అయితే కచ్చితమైన ఆహార నియమాలతో పాటు డాక్టర్స్ సూచించిన మందులు తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గకుండా కాపాడుకోవచ్చు.అలాగే ఇన్సూలిన్ తీసుకోవడం వల్ల కూడా తగ్గించుకోవచ్చు.అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు శరీరంపై పుండ్లు, మానని గాయాలతో బాధపడుతూ ఉంటారు.అలాగే ఒక్కొక్కసారి శరీర భాగాలను కూడా తొలగించే ప్రమాదం రావొచ్చు.ఇలాంటి వాటికి పరిష్కారంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ మాగ్నటిక్ జెల్( National University of Singapore Magnetic Gel ) ను తయారుచేసింది.మృత చర్మకణాల చికిత్సలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

Telugu Magnetic Gel, Sugar, Latest-Latest News - Telugu

మృత చర్మకణాల చికిత్స మూడు రెట్లు సమర్థవంతంగా మాగ్నటిక్ జెల్ పనిచేస్తున్నట్లు పలు రీసెర్చ్ లలో తేలింది.అలాగే అల్సర్ చికిత్సలో మూడు రెట్లు ఎక్కువగా పనిచేస్తుందని తేలింది.ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లోనూ స్కిన్ కణాల వృద్ది రేటను 240 శాతం పెంచింది.దీంతో పాటు కొల్లాజెన్ ఉత్పిత్తి రేటును కూడా రెట్టింపు చేసినట్లు బయటపడింది.కాలిన గాయాల చోట కొత్త కణాల వృద్దికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ అధ్యయనంలో వూహన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలీ, ఏజెన్సీ ఫర్ సైన్స్.

నాన్సాంగ్ టెక్నాలజీకల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.షుగర్ పేషెంట్లకు చిన్న దెబ్బ తగిలినా మానడానికి చాలా రోజులు పడుతుంది.

దీని వల్ల ఉపశమనం లభిస్తుందని చెబుతుున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube