గ్రీన్ టీ, చియా సీడ్స్( Chia seeds ).ఈ రెండిటి గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫుడ్స్ లో ఇవి రెండు ముందు వరుసలో ఉంటాయి.ముఖ్యంగా హెల్తీ డైట్ ఫాలో అయ్యేవారు, వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారు ఖచ్చితంగా గ్రీన్ టీ, చియా సీడ్స్ ను తమ డైట్ లో ఉండేలా చూసుకుంటారు.
అయితే ఈ రెండిటిని ఇప్పటివరకు విడివిడిగా తీసుకోవడమే మీకు తెలుసు.కానీ కలిపి కూడా తీసుకోవచ్చు.
గ్రీన్ టీతో చియా సీడ్స్ కలిపి తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ( Chia seeds )వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఒక గ్లాసు హాట్ వాటర్ ను తీసుకుని అందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి.తద్వారా గ్రీన్ టీ సిద్ధం అవుతుంది.
ఈ గ్రీన్ టీ లో నైట్ అంతా నానబెట్టుకున్న చియా సీడ్స్ ను కలిపి సేవించాలి.
ఉదయం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.ముఖ్యంగా మెటబాలిజం రేటును పెంచి వేగంగా బరువును కరిగించడానికి ఈ డ్రింక్ ఉత్తమంగా సహాయపడుతుంది.అలాగే ఈ గ్రీన్ టీతో చియా సీడ్స్ కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.ఎముకలు దృఢంగా మారుతాయి.
రక్తంలో కొలెస్ట్రాల్( Cholesterol ) కలుగుతుంది.అంతేకాదు, గ్రీన్ టీలో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే గుండె సంబంధిత జబ్బులు ( Heart diseases )వచ్చే రిస్క్ తగ్గుతుంది.
పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.మరియు ఒత్తిడి డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.
మైండ్ రిఫ్రెష్ అయ్యి యాక్టివ్ గా సైతం పనిచేస్తుంది.