కొన్ని రోజుల ముందు ‘బాహుబలి’ సినిమాకు ప్రేరణ మహాభారతం అనే వార్తలు మీడియాలో తెగ పుట్టుకు వచ్చాయి.మహాభారతంలోని కురుక్షేత్ర యుద్దంలోని పలు సంఘటనలను జక్కన్న ఈ సినిమా కోసం ఉపయోగించాడు అంటూ ప్రచారం జరిగింది.
అయితే వెంటనే ఆ ప్రచారంపై ‘బాహుబలి’ నిర్మాతల్లో ఒక్కరైన శోభు యార్లగడ్డ స్పందించాడు.‘బాహుబలి’ సినిమా కథ మొత్తం కల్పితం అని, మహాభారతం కాని, రామయణంకు గాని సంబంధం లేదు అంటూ తేల్చి చెప్పాడు.
అయితే తాజాగా నిర్మాత కాదన్న విషయాన్ని దర్శకుడు స్వయంగా అవును అన్నాడు.
తాజాగా జక్కన్న రాజమౌళి మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుండి కూడా రామాయణ మహాభారతంలు వింటూ వచ్చానని, వాటి నుండి పుట్టుకు వచ్చిందే ఈ కథ అని చెప్పుకొచ్చాడు.
రామాయణ, మహాభారతాల నుండి పలు సంఘటలను ప్రేరణగా తీసుకుని కథను రాసుకోవడం జరిగిందని జక్కన్న ప్రకటించాడు.అయితే మొత్తం కథకు వాటితో ఏమాత్రం సంబంధం లేకుండా, కల్పితంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
తాజాగా విడుదలైన ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది.సినిమాపై అంచనాలను డబుల్ చేసింది.
ఇక సినిమా జులై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.