పేదవాడిగా పుట్టినవాళ్లలో చాలామంది తమ కష్టంతో ఏదో ఒకరోజు కోటీశ్వరులు కావాలని భావిస్తుంటారు.అయితే అలా తను కన్న కలను నెరవేర్చుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన వారిలో ఆటో డ్రైవర్ అన్నాదురై( Autowala Annadurai ) ఒకరు.
పెద్దగా చదువుకోకపోయినా బిజినెస్ మేన్ కావాలనే కలను ఎంతో కష్టపడి నెరవేర్చుకోవాలని అన్నాదురై అనుకున్నారు.అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల అన్నాదురై ఆటోవాలాగా మారాడు.
అయితే ఆటోడ్రైవర్( Auto Driver ) గా పని చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని అన్నాదురై ఐఐఎంలో పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు.ఈ ఆటో డ్రైవర్ నెల సంపాదన ఏకంగా 5 లక్షల రూపాయలు కావడం గమనార్హం.
ఆటోపై నెలకు రెండు లక్షలు, క్రియేటివిటీతో మరో మూడు లక్షలు సంపాదిస్తున్న అన్నాదురై తన ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు వేర్వేరు సౌకర్యాలు అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు.
2013 సంవత్సరంలో టెడ్ ఎక్స్ లో మాట్లాడటం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన అన్నాదురై తన సక్సెస్ స్టోరీకి సంబంధించిన వ్యాపార పాఠాలను ఐఐటీ, ఐఐఎం( IIT IIM )లకు వెళ్లి చెబుతున్నారు.మోటివేషనల్ స్పీకర్ గా ప్రశంసలు అందుకుంటూ ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీల నుంచి ఆర్థిక సాయం పొందుతూ ఎంతోమందికి అన్నాదురై ఆదర్శంగా నిలుస్తున్నారు.
తన ఆటోలోని ప్రయాణికులకు ఇంటర్నెట్, మినీ ఫ్రిజ్ ద్వారా పళ్లు, నీళ్లు , కూరగాయలు, ఐప్యాడ్( Ipad ), ట్యాబ్, మ్యాగజైన్లు అందించడం ద్వారా ప్రయాణికుల మనస్సు గెలుచుకున్నారు.ఇలా ఎన్నో ప్రయోగాలు చేసి అన్నాదురై సక్సెస్ అయ్యారు.అన్నాదురై తమిళంతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు.
అన్నాదురై తన ప్రతిభతో ఈ స్థాయికి ఎదిగారు.ఒక ఆటోవాలా ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తూ నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడంటే అతని తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అన్నాదురై సక్సెస్ స్టోరీ( Annadurai Success Story ) ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది.