రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.శంకర్ పల్లి మండలంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ భార్యను హత్య చేసి అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు ముందుగా భార్యను హత్య చేశాడు.తరువాత ఇద్దరు పిల్లలను హతమార్చేందుకు ప్రయత్నించగా పారిపోయి వచ్చినట్లు పెద్ద కుమారుడు చెబుతున్నాడు.
భార్య హత్య అనంతరం నాగరాజు కూడా బలవన్మరణం చెందాడు.కాగా ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.