సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిన సంగతి మనకు తెలిసిందే.అలాంటి అషురెడ్డి ( Ashu Reddy ) ముందు వరుసలో ఉంటారు.
ఈమె కాస్త సమంత ( Samantha ) పోలికలతో ఉండటంతో అందరూ కూడా జూనియర్ సమంత అంటూ ఈమెను తెగ హైలైట్ చేశారు.ఇలా కెరియర్ మొదట్లో టిక్ టాక్ వీడియోలో డబ్ స్మాష్ వీడియోలు చేసుకుంటే ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం బాగా పాపులర్ అయింది.
ఇలా సోషల్ మీడియాలో ఈమెకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ రావడంతో ఏకంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడం కూడా మొదలుపెట్టారు.
ప్రముఖ సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma )తో ఈమె చేసిన ఇంటర్వ్యూ తారాస్థాయికి చేరుకుందని చెప్పాలి.ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈమె ఒక్కసారిగా సంచలనంగా మారారు.అయితే ఈమెకు సోషల్ మీడియాలో రోజురోజుకు విపరీతమైనటువంటి ఫాలోయింగ్ పెరగడంతో బిగ్ బాస్( Bigg Boss ) అవకాశం కూడా అందుకున్నారు.
ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లినటువంటి అషురెడ్డి ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.అలాగే బుల్లితెర కార్యక్రమాలలో కూడా ఈమె సందడి చేస్తున్నారు.
ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అషురెడ్డి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇకపోతే ఈమె తరచూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయం గురించి ఒక ఫన్నీ చేశారు అయితే ఈ రీల్ చేస్తున్న సమయంలో తన తల్లి మాత్రం వెనకనుంచి తనని చితకబాదింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో భాగంగా అషురెడ్డి కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ ఒక వైరల్ వీడియోకు లిప్ సింక్ చేస్తూ రీల్ చేసింది.ఇంట్లో పనిచేయాలంటూ, తను అలిగినప్పుడు బదిమాలాడాలని రీల్ ద్వారా చెప్పుకొచ్చింది.అయితే ఆ వాయిస్ కూడా అషురెడ్డికి బాగా సింగ్ అయ్యింది.ఆ రీల్ చేసే సమయంలో అషు వాళ్ల తల్లి విని షాకింగ్ గా రియాక్ట్ అయ్యింది.
చీపురుతో అషురెడ్డిని రెండు దెబ్బలు వేసింది ఇలా తన తల్లి చీపురుతో తనని కొట్టినప్పటికీ ఈ వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇక ఈ వీడియోని షేర్ చేసినటువంటి ఈమె నిజంగానే ఆ వాయిస్ నాదేనని అమ్మ భావిస్తుంది అంటూ క్యాప్షన్ పెట్టారు.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.అయ్యయ్యో ఏంటి అషురెడ్డి ఇలా అయ్యింది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం మంచి పని చశావమ్మా అంటూ ఈ వీడియో పై కామెంట్స్ చేయడమే కాకుండ పెద్ద ఎత్తున లైకుల వర్షం కురిపిస్తున్నారు.