నిన్న విడుదలైన ఫ్యామిలీ స్టార్ మూవీకి( Family Star Movie ) నెగిటివ్ టాక్ వచ్చినా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన సినిమా కావడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతూ మంచి కలెక్షన్లను సాధిస్తోంది.ఈ సినిమా బడ్జెట్ 100 కోట్ల రూపాయలు అని నటీనటుల రెమ్యునరేషన్ల కోసమే 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు అయిందని సమాచారం అందుతోంది.
అయితే ఒక నటి ఫ్యామిలీ స్టార్ యూనిట్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఫ్యామిలీ స్టార్ మూవీలో ఒకే ఒక సీన్ లో కనిపించిన ఆశా బొర్రా( Asha Borra ) చిత్రయూనిట్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
నాలాంటి నటిని అవుట్ స్టఫ్ లా వాడుకుని వదిలేస్తే సినిమా ఫ్లాప్ కాకుండా ఏమవుతుందని ఆమె అన్నారు.నా ఆరోగ్యం బాలేకపోయినా ఇచ్చిన మాట కోసం షూట్ కు వెళ్లానని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడి పని చేశానని ఆమె తెలిపారు.
కనీసం నాకు ఒక్క డైలాగ్ ఉన్నా ఈ పోస్ట్ రాసేదాన్ని కాదని ఆశా బొర్రా పేర్కొన్నారు.
చెప్పిన పారితోషికం( Remuneration ) ఇవ్వలేదని ప్రయాణ ఖర్చులు అయినా ఇస్తారని భావిస్తే అవి కూడా అవి కూడా ఇవ్వలేదని హోటల్ స్టే ఖర్చులు సైతం ఇవ్వకుండా మాకేం సంబంధం అన్న విధంగా వ్యవహరించారని ఆమె తెలిపారు.విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) మాట్లాడే సీన్ ఉన్నా కొంత సంతృప్తి ఉండేదేమోనని ఆశా బొర్రా పేర్కొన్నారు.ఆశా బొర్రా కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఆశా బొర్రా కామెంట్స్ పై దిల్ రాజు( Dil Raju ) బ్యానర్ నుంచి ఎవరైనా స్పందిస్తే బాగుంటుందని చెప్పవచ్చు.దిల్ రాజు బ్యానర్ గురించి ఎప్పుడూ ఇలాంటి కామెంట్లు వినిపించలేదు.ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోని సమయంలో ఇలాంటి కామెంట్స్ ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది ఆశాబొర్రాపై ఫైర్ అవుతున్నారు.