యూకేలో ముగిసిన వైద్యుల సమ్మె .. ఇండియన్ ఆరిజిన్ డాక్టర్స్ యూనియన్ కీలక ప్రకటన

సీనియర్ నేషనల్ హెల్త్ సర్వీస్( Senior National Health Service ) (ఎన్‌హెచ్ఎస్) వైద్యులు ప్రభుత్వ వేతన ఆఫర్‌ను అంగీకరించిన తర్వాత బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ (బీఎంఏ) కన్సల్టెంట్స్ కమిటీ భారతీయ సంతతి చెందిన చైర్ శుక్రవారం ఏడాదిగా జరుగుతున్న సమ్మెకు ముగింపు పలికారు.డాక్టర్ విశాల్ శర్మ ( Dr.

 Senior Doctors In England Accept New Pay Offer And End Strikes , Senior Nationa-TeluguStop.com

Vishal Sharma )మాట్లాడుతూ .కన్సల్టెంట్స్ వారి వేతనాన్ని 2008 నాటి స్థాయిలకు పునరుద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఈ ఒప్పందం ప్రారంభ ముగింపు అన్నారు.బీఎంఏ డాక్టర్ల యూనియన్ ద్వారా సమర్పించబడిన ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న ఎన్‌హెచ్ఎస్ కన్సల్టెంట్‌లలో దాదాపు 83 శాతం మంది వృత్తి తరపున ప్రతిపాదనను అంగీకరించడానికి అనుకూలంగా ఓటు వేశారు.వేతనానికి సంబంధించిన మా ఆందోళనలను పరిష్కరించడానికి స్వతంత్రంగా వ్యవహరించే వేతన సమీక్ష ప్రక్రియ ఎలా పనిచేస్తుందో చూశామని శర్మ అన్నారు.

Telugu British Medical, Ddrb Doctors, England, Review Process, Senior Doctors, S

ప్రభుత్వ జోక్యం , వేతన సమీక్ష ప్రక్రియలో వైఫల్యం కారణంగా పదే పదే వేతన కోతలను ఎదుర్కొన్న తర్వాత కన్సల్టెంట్స్ గళమెత్తారని ఆయన వెల్లడించారు.అయినప్పటికీ డీడీఆర్‌బీ వైద్యుల( DDRB Doctors ) వేతనాన్ని పునరుద్ధరించడానికి , తదుపరి వివాదాలు తలెత్తకుండా నిరోధించడానికి దాని స్వతంత్రతను ఉపయోగించుకోవడం ఇప్పుడు అవసరమన్నారు.కన్సల్టెంట్ పే స్కేల్‌ను సంస్కరించాలన్న ప్రభుత్వ మునుపటి ప్రతిపాదనపై మెరుగుదలని తాజా ఆఫర్ ప్రతిబింబిస్తోందని బీఎంఏ పేర్కొంది.ఇది ఇప్పుడు 2.85 శాతం అప్ లిఫ్ట్‌ను కలిగి వుంది.తాజా అప్‌గ్రేడ్ అనేది గతేడాది రివ్యూ బాడీ ప్రాసెస్‌లో అందించబడిన 6 శాతం పే అప్ లిఫ్ట్‌కి అదనం.2024-25కి సంబంధించిన రివ్యూ బాడీ ప్రాసెస్ ఫలితం తర్వాత పే అవార్డు వేరుగా వుంటుంది.

Telugu British Medical, Ddrb Doctors, England, Review Process, Senior Doctors, S

కాగా.తమ స్పాన్సర్‌లు ఉపాధి కల్పించడంలో విఫలమవ్వడంతో యూకేలో కొందరు విదేశీ ఆరోగ్య సంరక్షణ కార్మికులు ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీనిలో భాగంగా తమకు ఉద్యోగాన్ని వెతుక్కునేందుకు సమయం కేటాయించాలని యూకే ప్రభుత్వాన్ని కోరుతూ జారీ చేసిన ఆన్‌లైన్ పిటిషన్‌‌కు మద్ధతు పెరుగుతోంది.

కొద్దిరోజుల్లోనే వందలాది మంది దీనిపై సంతకాలు చేశారు.మార్చి ప్రారంభంలో అమల్లోకి వచ్చిన కఠినమైన నిబంధనల ప్రకారం.వలసదారులకు స్పాన్సర్‌లుగా వ్యవహరిస్తున్న ఇంగ్లాండ్‌లోని కేర్ ప్రొవైడర్లు .కేర్ క్వాలిటీ కమీషన్ (సీక్యూసీ) హెల్త్ అండ్ సోషల్ కేర్ కోసం ఇండస్ట్రీ రెగ్యులేటరీలో నమోదు చేసుకోవాలి.దీని వల్ల భారత్ వంటి దేశాలకు చెందిన అమాయక కార్మికులు తమ లైసెన్సును కోల్పోయినప్పుడు .వెంటనే మరో ఉపాధిని వెతుక్కోవడానికి కేవలం 60 రోజుల గడువు మాత్రమే వుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube